ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కెరీర్ ప్రారంభంలో అసెస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆయన రామ్ గోపాల్ వర్మ తో దగ్గర పనిచేసారు. అంతేకాదు వర్మ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసారు. ఆ విషయం వర్మ ఈ రోజు గుర్తు చేస్తూ ఓ వీడియో షేర్ చేసారు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ చిత్రం హిందీ రీమేక్ లో పూరి జగన్నాథ్ కొద్ది సేపు కనిపిస్తారు. అదీ బోటనీ పాఠముంది… పాటలో మాత్రమే పూరీ కన్పిస్తారు. ఈ విషయాన్ని వీడియోతో సహా ట్విటర్‌లో పంచుకున్నారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. అప్పటి జూనియర్ ఆర్టిస్ట్.. ఇప్పుడు సినిమా దర్శకుడు అంటూ ట్వీట్ చేశారు.
The junior artiste in blue shirt is today’s super director Puri Jagan ..Hey @purijagan WHAT A JOURNEY🙏🙏🙏💐💐💐 pic.twitter.com/irRXxfhK3v
— Ram Gopal Varma (@RGVzoomin) June 24, 2019
దీనిపై పూరీ స్పందిస్తూ.. అవును, అందులో డ్యాన్స్ చేస్తోంది నేనేనంటూ రీ ట్వీట్ చేశారు. వర్మ పంచుకున్న ఈ వీడియోలో నీలి రంగు షర్ట్‌లో ఉన్న పూరీ జగన్నాథ్ మిగతావారితోపాటు పాటలో స్టెప్పులేస్తూ కనిపిస్తారు. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి దర్శకుడు పూరీ జగన్నాథ్ నిదర్శనమంటూ రాంగోపాల్ వర్మ అభినందించారు.