బాలీవుడ్ హాట్ స్టార్, ఐటమ్ బాంబ్ గా ముద్ర పడ్డ రాఖీ సావంత్ ఈ మధ్య ఇన్స్ స్టా గ్రామ్ వేదికగా రెచ్చిపోతున్నారు. ఆమె తన సెల్ఫీ వీడియోలను ఇన్స్టా లో పోస్టు చేస్తున్నారు. కానీ ఆమె వీడియోలు మరీ వివాదాన్ని రగిలిస్తున్నాయి. సినిమా అవకాశాలు తగ్గడంతో రాఖీ కొత్త అవతారమెత్తిందని నెటిజన్లు షైర్ అవుతున్నారు.
మరోవైపు ఆమె నిత్యం వివాదాల్లో ఉండే సార్ట్స్ తో గొడవ పడుతూ పబ్లిసిటీ కొట్టేసే ప్రయత్నం చేస్తోందని బాలీవుడ్ వర్గాలు బాహటంగానే చెప్పుకుంటున్నాయి. తాజాగా రాఖీ సావంత్ ఒక వీడియోను తన ఇన్స్టా వాల్ మీద పోస్టు చేశారు. బికినీలో ఉన్న రాఖీ సావంత్ ఒంటికి తాళం వేసుకుని డ్యాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్ ఉద్దేశం ఏమై ఉంటుందో కానీ ఆ వీడియో వివాదం రేపుతున్నది. కింద రాఖీ సావంత్ వివాదాస్పద వీడియో ఉంది.