బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘లక్ష్మీ బాంబ్’.తమిళ, తెలుగు భాషల్లో హిట్ అయిన ‘కాంచన’ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమా ద్వారా రాఘవ లారెన్స్ దర్శకుడిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు దర్శకుడు రాఘవ లారెన్స్. తనని దర్శకుడుగా గౌరవించని టీమ్ తో కలిసి పనిచేయనంటూ సంచలన నిర్ణయంతో బయటకు వచ్చేసారు. ఇంతకీ ఏం జరిగిందో పోస్ట్ ద్వారా తన అభిమానులకు తెలియచేసారు.
Dear Friends and Fans..!I
In this world, more than money and fame, self-respect is the most important attribute to a person's character. So I have decided to step out of the project, #Laxmmibomb Hindi remake of Kanchana@akshaykumar
@RowdyGabbar @Advani_Kiara pic.twitter.com/MXSmY4uOgR— Raghava Lawrence (@offl_Lawrence) May 18, 2019
ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తన ప్రమేయం లేకుండా రిలీజ్ చేశారని.. విడుదలైన విషయం కూడా మూడో వ్యక్తి చెబితే తప్ప తనకు తెలియలేదని లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ తనకు నచ్చలేదని పేర్కొన్నాడు. గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదని తమిళంలో ఓ సామెత ఉంది. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం. నాకు ఆత్మాభిమానం ఉంది కాబట్టి సినిమా నుంచి తప్పుకుంటున్నా. నేను కారణం చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే కారణాలు చాలా ఉన్నాయి.
పోస్టర్ రిలీజ్ చేసినట్లు మూడవ వ్యక్తి ద్వారా నాకు తెలిసింది. ఈ విషయంలో దర్శకుడిగా చలా బాధపడుతున్నా. ఇలాంటి పరిస్థితి ఏ దర్శకుడికి రాకూడదు. ఇది నా సినిమా కాబట్టి స్ర్కిప్ట్ ఇచ్చేయమని అడగను. కథ అక్షయ్ కి ఇచ్చేసి..వారికి నచ్చిన వారితో సినిమా చేసుకోమని చెబుతానని లారెన్స్ వెల్లడించారు. అలాగే చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు.