సెలబ్రెటీలను ఇంటర్వూ చేసినప్పుడు అందులో వివాదంగా అనిపించిన అంశాలను జాగ్రత్తగా ఎడిట్ చేసి..మరింత నిప్పు రాజేయటం చాలా కాలంగా మీడియా చేస్తున్న పనే. అయితే వాటి వల్ల పెద్దగా ఎవరికీ నష్టం రానప్పుడు వాటిపై ఎవరూ స్పందించరు. కానీ ఇప్పుడు బాలీవుడ్ నటి ప్రీతి జింతా పరిస్దితి వేరు. ఆమె ఇచ్చిన ఇంటర్వూలోని కొంత మేర ఎడిట్ చేసి కొత్త అర్దం పుట్టించారు.
దాంతో ప్రీతి జింతా చెప్పిన మాటలు వివాదాస్పదమయ్యాయి. మీటూ ఉద్యమంపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానన్న విమర్శలపై ప్రీతి జింటా స్పందించింది.దాంతో ప్రీతి జింతా స్వయంగా తాను మాట్లాడింది వేరు అని చెప్తూ ట్వీట్ చేయాల్సి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… రీసెంట్ గా బాలీవుడ్ హంగామా అనే వెబ్ సైట్ కు ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో మీటూ బాధితులను అవమానించేలా మాట్లాడినట్లు ప్రీతిపై విమర్శలు వచ్చాయి. అయితే ఆ ఇంటర్వ్యూని కావాలనే అలా ఇష్టం వచ్చినట్లు ఎడిట్ చేశారని, తాను నిజానికి అలా మాట్లాడలేదని ఆమె ట్వీట్ చేసింది. ఇంటర్వ్యూ చేసిన సదరు జర్నలిస్ట్ ఫరీదూన్ షహర్యార్‌పై ఆమె తీవ్రంగా మండిపడింది.
అదే రోజు తాను మరో 25 ఇంటర్వ్యూలు ఇచ్చానని, ఎక్కడా లేకుండా ఇందులో మాత్రమే అలా ఎందుకు వచ్చిందని ప్రీతి ప్రశ్నించింది. ఈ ఇంటర్వ్యూ చూసి తాను చాలా అసంతృప్తికి గురైనట్లు ఆమె చెప్పింది. తనకూ మీటూ అనుభవం ఎదురైతే బాగుండేదని, మీకు సరైన సమాధానం ఇచ్చేదానని ప్రీతి అన్నట్లుగా ఆ ఇంటర్వ్యూలో ఉంది.
అంతేకాదు మీటూ బాధితులను అవమానించేలా.. మిమ్మల్ని అవతలివాళ్లు ఎలా చూడాలని అనుకుంటున్నారో అలాగే వాళ్లు చూస్తారు అని ఆమె అనడం సంచలనం రేపింది.