బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ ఫ్యామిలీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ముందుగా అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వైరస్ బారిన పడటంతో ముంబై నానావతి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. జులై 11న కరోనా సోకినట్లు అమితాబ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఆ తర్వాత అమితాబ్ కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆద్యకు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వీళ్లిద్దరు కూడా నానావతిలో చేరారు. తాజాగా ఐశ్వర్యారాయ్, ఆద్యకు మరోసారి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇరువురు డిశ్చార్జ్ అవుతున్నట్లు విషయాన్ని రివీల్ చేసారు. అయితే అమితాబ్ బచ్చన్, అభిషేక్ మాత్రం ఇంకా కోలుకున్నట్లు లేదు.
ఇంకా ఆసుపత్రిలో ఉండి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు అభిషేక్ తెలిపారు. కానీ అమితాబ్ మాత్రం జులై 11న ట్వీట్ చేసిన తర్వాత అభిమానులకు టచ్ లో లేరు. ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి అమితాబ్ టచ్ లో లేకపోవడం తో తాజాగా అభిమానుల పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. అమితాబ్ కు వైద్యం అందిస్తోన్న నానావతి యాజమాన్యం ఇప్పటివరకూ ఒక్కసారి మాత్రమే హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తర్వాత ఎలాంటి సమాచారాన్ని మీడియాకు అందజేయలేదు. దీంతో అభిమానుల్లో అందోళన మరింత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అమితాబ్ వయస్సు 77 సంవత్సరాలు.
కరోనా వైరస్ వయసు మీద పడిన వారిపై, చిన్న పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ వయసులో ఇమ్మున్యుటీ లో ఇబ్బందులు ఏర్పడుతాయని డాక్టర్లు చెబుతుండటంతోనే అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. మరి ఈ సందేహాలకు అభిషేక్ బచ్చన్ ఎలా బధులిస్తారు? నానావతి ఆసుపత్రి వర్గాలు స్పందిస్తాయా? అన్నది చూడాలి. ఇక మహరాష్ర్టలో కరోనా విలయ తాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. రోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య భారీగానే నమోదవుతోంది.