వైరల్ ఫొటో: చెర్రీ హీరోయిన్…రెడ్ బికినీలో రెచ్చిపోతూ

రామ్‌చరణ్ మొదటి సినిమా  ‘చిరుత’ తో తెరంగేట్రం చేసింది నేహా శర్మ. ఆ తర్వాత వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత ఆమె తెలుగులో మరి కనిపించలేదు. బాలీవుడ్ లో అడపా దడపా చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.

అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా తన హాట్ అందాలను మ్యాగజైన్ కవర్స్ పై పరచం మాత్రం మర్చిపోలేదు. తాజాగా ఆమె ‘మాగ్జిమ్’ మ్యాగజైన్ కోసం హాట్ ఫోటో షూట్ చేసింది నేహా శర్మ. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో అక్కడిదే.

source: twitter

యూత్ కి గిలిగింతలు పెట్టే అందం నేహా శర్మ సొంతం కావటంతో సోషల్ మీడియాలో ఆమెను ఫాలోయింగ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే ఇక్కడ పెరిగి ఫాలోయింగ్ కు సరపడ ..ఆఫర్స్ మాత్రం రావటం లేదు. పోనీ బాలీవుడ్ లో అయినా దూసుకుపోతోందా అంటే అక్కడా అంత సీన్ లేదు. ఏవో చిన్న పాత్రలు కొన్ని చిన్న చిత్రాల్లో నేహా శర్మ చేసింది.

అవేవి సహజంగానే ఈ హాట్ బ్యూటీకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ప్రస్తుతం ఇలా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ దర్శక నిర్మాతలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మరి ఆమె కష్టం ఫలించి, పెద్ద ఆఫర్స్ రావాలని కోరుకుందాం.