గ్రేట్ కదా: 23 భాషల్లో బయోపిక్

ఒక భాషల్లో ఒక సినిమా తియ్యాలంటేనే నానా రకాల సమస్యలు వస్తూంటాయి. ఇబ్బందులు పడుతూంటారు దర్శక,నిర్మాతలు. అలాంటిది ఇరవై మూడు భాషల్లో ఒకే సినిమాని అదీ..ఓ బయోపిక్ ని నిర్మించమంటే మాటలా..అయితే అవతలి వైపు సమర్ధలు ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే. ఇంతకీ ఎవరి బయోపిక్ గురించి మాట్లాడుతున్నామో మీకు ఇప్పటికే అర్దమై ఉంటుంది..

గత కొంతకాలంగా దేశ వ్యాప్తంగా బయోపిక్ ల పరంపర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోడీ బయోపిక్ తెరపైకి వచ్చింది. ఇందులో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాని మోడీ పాత్రలో నటిస్తున్నారు.

కెరీర్ లో కాస్త వెనకబడినట్లు కనిపిస్తున్న వివేక్ ఒబెరాయ్ ..ఈ సినిమాతో మళ్లీ తన ఫాంలోకి వచ్చే అవకాశముందని బాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తే..మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రధాని మోడీ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న ఈ బయోపిక్ లో మోడీ జీవితానికి సంబంధించిన విషయాలను కళ్లకట్టినట్లు ప్రేక్షకులమ ముందు ఉంచేందుకు దర్శకుడు శతవిధాలుగు ప్రయత్నిన్నాడు. చాయ్ వాలా జీవితం నుంచి ప్రధాని అయ్యే వరకు చేసిన అలుపు ఎరగని పోరాటాన్ని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను చూపించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.