“లైగర్”..ఏంటి సినిమా షూట్ ఇంకా అవ్వలేదా?ప్రెజెంట్ ఈ షూట్ లో.!

తెలుగు సినిమా యూత్ లో ఒక సెన్సేషన్ గా మారినటువంటి స్టార్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ లో మొదటిసారిగా చేస్తున్న పాన్ ఇండియా సినిమా “లైగర్”. స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ప్లాన్ చేసిన ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. 

మరి ఈ సినిమాని ఎప్పుడో స్టార్ట్ చెయ్యగా గత రెండు నెలల కితమే షూటింగ్ కంప్లీట్ అయ్యినట్టుగా మేకర్స్ తెలిపారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదట. ఒక డ్యూయెట్ సాంగ్ మాత్రం బ్యాలన్స్ ఉందని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. 

మరి ఈ సాంగ్ షూటింగ్ నే చిత్ర యూనిట్ ఈరోజు షురూ చేసినట్టుగా సమాచారం. ముంబై లో ఈ సాంగ్ ని పూరి అండ్ కో విజయ్ దేవరకొండ బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే లపై చిత్రీకరిస్తారట. దీనితో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది అని సినీ వర్గాల వారు చెబుతున్నారు.  

మొత్తానికి అయితే లాస్ట్ చేసి మాత్రం ఓ సాంగ్ ని ఉంచుకున్నారని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో వరల్డ్ దిగ్గజ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటించగా ఛార్మి మరియు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ లు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.