ప్రభాస్ “సలార్” పై లేటెస్ట్ ఫ్రెష్ అప్డేట్ ఏమిటంటే..!

ఇప్పుడు మన తెలుగు నుంచి ఉన్న బిగ్ స్టార్స్ ఒకే సమయంలో రెండు మూడు సినిమాలు షూటింగ్స్ చేసేస్తున్నారు. మరి ఆ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ రవితేజ అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లు ప్రథములు.

అయితే ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో రెండు సినిమాల షూటింగ్ చేస్తుండగా మూడో సినిమా మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది. మరి ఆల్రెడీ సెట్స్ లో ఉన్నటువంటి చిత్రాల్లో కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ ఏక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కూడా ఒకటి.

ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా ఇప్పటి వరకు ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన భారీ ఏక్షన్ డ్రామా కేజీఎఫ్ చాప్టర్ కి పదింతలు ఎక్కువ ఎలిమెంట్స్ తో తీస్తున్నానని దర్శకుడు చెప్పాడు. మరి ఈ రేంజ్ లో చేస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూట్ లోకి వెళ్ళాడు.

ఇక ఇది పూర్తయ్యాక మళ్ళీ సలార్ సెట్స్ లో ప్రభాస్ అడుగు పెట్టబోతున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ షూటింగ్ అయితే ఆగస్ట్ మొదటి వారం నుంచి స్టార్ట్ కానుండగా ఇంకో ఇంట్రెస్టింగ్ బజ్ కూడా వినిపిస్తుంది.

ఈ షూట్ లో మలయాళ స్టార్ నటుడు పృథ్వీ రాజ్ కూడా పాల్గొంటాడని తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబలె ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.