సీమాంధ్ర కు చెందిన మాజీ రాజకీయ నాయకుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికల్లో గెలిచే మరో మూడు పేర్లను వెల్లడించారు. తన సర్వే వివరాలు చెప్పను చెప్పను అంటూనే బాంబు పేల్చారు. తెలంగాణలో కాంగ్రెస్ వైపే ప్రజానాడి ఉందని వెల్లడించారు. అయితే దీనికి పోలింగ్ శాతానికి లంకె ఉన్నట్లు చెప్పారు. పోలింగ్ శాతం బాగా పెరిగితే కూటమి గెలుస్తుందన్నారు. పోలింగ్ శాతం తగ్గితే మాత్రం హంగ్ వస్తుందన్నారు. కానీ తన సర్వేలో టిఆర్ఎస్ మాత్రం ఓడిపోతుందని లగడపాటి తేల్చిపారేశారు. సర్వే కోసం ప్రతి నియోజకవర్గంలో 1200 నుంచి 2000 శాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించారు లగడపాటి.
గతంలో ఇద్దరి పేర్లు వెల్లడించిన రాజగోపాల్ తాజాగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మరో మూడు పేర్లను వెల్లడించారు.
ఆ మూడు పేర్లు ఇవి.
1 ఇబ్రహింపట్నం లో ఇండిపెండెంట్ (కాంగ్రెస్ నేత) మల్ రెడ్డి రంగారెడ్డి
2 బెల్లం పల్లిలో టిఆర్ఎస్ రెబెల్ గా పోటీ చేసిన జి వినోద్ (వివేక్ సోదరుడు, టిఆర్ఎస్ రెబెల్)
3 మక్తల్ లో ఇండిపెడెంట్ గా పోటీ చేసిన జలంధర్ రెడ్డి
వీరు ముగ్గురు గెలవబోతున్నట్లు లగడపాటి వెల్లడించారు.
గతంలో పాలమూరు జిల్లాలోని నారాయణపేటలో శివకుమార్ రెడ్డి గెలుస్తాడని లగడపాటి వెల్లడించారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ నియోజకవర్గం నుంచి అనీల్ కుమార్ జాదవ్ గెలుస్తాడని కూడా చెప్పారు.
దీన్నిబట్ట ిలగడపాటి చెప్పిన పేర్లలో ఎక్కువ మంది కాంగ్రెస్ రెబెల్స్ ఉండడం గమనార్హం. అంతేకాకుండా వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో ిటిఆర్ఎస్ ఆధిక్యంలో ఉందని లగడపాట ివెల్లడించారు.
అలాగే కరీంనగర్, మహబూబ్ నగర్ పోటాపోటీగా ఉన్నాయి.
హైదరాబాద్ అత్యధికంగా ఎంఐఎం గెలుస్తుంది. ఎంఐఎం కు పోను బిజెపి, టిఆర్ఎస్, కూటమి పంచుకుంటాయన్నారు.
రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఆధిక్యం సాధిస్తుందని చెప్పారు.
ఈ ఎన్నికల్లో బిజెపికి గతం కంటే అధికంగా సీట్లు వస్తాయని తెలిపారు. పోలింగ్ శాతం ఎంతగా పెరిగితే ప్రజా కూటమికి అంతగా లాభం చేకూరుతుందని లగడపాటి వెల్లడించారు.
పోలింగ్ శాతం తగ్గితే హంగ్ వచ్చే చాన్స్ ఉందన్నారు. ఓవరాల్ గా చూస్తే టిఆర్ఎస్ ఓడిపోవచ్చని లగడపాటి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ వైపే ప్రజా నాడి ఉందని లగడపాటి అన్నారు. మెజార్టీ జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతున్నట్లు చెప్పారు.
లగడపాటి ఇంకేమన్నారంటే…
తెలంగాణా ముందస్తూ ఎన్నికలు చాలా ఆసక్తి గా జరుగుతున్నాయన్నాయి. ఫ్లాష్ టీమ్ సర్వే అని తాము గతంలో సర్వేలు చేశాము. అన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల సర్వేలు 6 నెలలు ముందే చేస్తూ వస్తున్నాం. నా సర్వేలు పక్షపాతం లేకుండా చెపుతూ వస్తున్నాను. ఒక దశ లో సొంత పార్టీ కూడా గెలవదు అని సర్వే లో చెప్పిన సందర్భం ఉంది. గతంలో రెండు రాష్ట్రల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ లో టీడీపీ, తెలంగాణా లో టీఆరెస్ గెలుస్తుందని చెప్పాను అదే జరిగింది.
నేను తెలంగాణా సీఎం కేసిఆర్ ను రెండు సార్లు మాత్రమే కలిశాను. నేను తిరుమల వెళ్లినప్పుడు విలేకరులు అడిగినప్పుడు రెండు ఇండిపెండెంట్లు ను గెలుస్తారని చెప్పాను. మరో ఐదు పేర్లు వెల్లడిస్తా, ఆ క్కడ పోటీ చేసే వారు నా మిత్రులు ఉన్నారు. వారు సర్వే ఫలితాలు చెప్పవద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు, అందుకే చెప్పలేక పోతున్నాను.
ఈ ఎన్నికలు గత ఎన్నికల మాదిరి పోలింగ్ 68.3 ఉంటే ఒకే విధంగా ఉంటుంది. పోలింగ్ పెరిగితే కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటుంది. 68.3 పోలింగ్ అయితే హాంగ్ వచ్చే అవకాశం ఉంది. 68.3 పోలింగ్ తటస్థంగా ఉంటే 7 తేదీ చెపుతాను. ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం అంత ఈజీగా ఉండవు. నాకు ఎవరి మీద శత్రుత్వం లేదు. ఎవరికో పక్షపాతంగా నేను ఈ వివరాలు చెప్పడంలేదు.