ప్రపంచాన్ని కరోనా వైరస్ ఎలా ఒణికిస్తుందో తెలిసిందే. మహమ్మారి మాటేసి మరి కాటేస్తుంది. కరోనా సోకనంత వరకే..సోకిన తర్వాత అయ్యో పాపం అనే సన్నివేశం లేదు. మనిషికి మనిషినే శత్రువుని చేసి మింగేస్తుంది. ఇప్పటికే లక్షల్లో కేసులు…వేలల్లో మరణాలు తాజా పరిస్థితులు చూస్తుంటే కాలజ్ఞానంలో బ్రహ్మంగారి వాక్కు ఫలించినా…ఫలించొచ్చు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మళ్లీ భవిష్యత్ లో ఇంత భయంకరమైన వైరస్ లు రాకూడదంటూ అంతా దేవుడ్ని ప్రార్ధిస్తున్నారు. అయితే ఆదర్శక, నిర్మాత మాత్రం కరోనా కన్నా ప్రమాదమని తనని తాను తెలివిగా ప్రమోట్ చేసుకుంటున్నాడు.
అంతనెవరో కాదు. బాలీవుడ్ దర్శక, నిర్మాత కమ్ యాక్టర్ కరణ్ జోహార్. అప్పుడప్పుడు కామియో పాత్రలతో మెప్పించే కరణ్ లో మంచి పెర్పామర్ ఉన్నాడని..వాడ్ని బయటకు తీస్తే కరోనా కన్నా ప్రమాదకరంగా ఉంటుందని అంటున్నారు. తాజాగా నెటింట్లో కరణ్ జోహార్ తెల్లు జుట్టుతో ఉన్న కొత్త ఫోటో ఒకటి వైరల్ అవ్వడంతో నేటి జనులు, అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతుంటే ఆయన అలా స్పందించారు. ఈ నేపథ్యంలో తండ్రి పాత్రలో నటించడానికి సిద్దంగా ఉన్నాను. ప్రస్తుతం దేశంలో ఉన్న వైరస్ కంటే నా నటన ఎంతో భయంకరంగా ఉంటుందని నాకు తెలుసు. కానీ నాలోని నటుడిని బయట పెట్టడం కోసం సెకెండ్ ఛాన్స్ ఆశించడం తప్పలేదని అనుకుంటున్నానటీనటులను ఎంపిక చేసే దర్శకులకు, విమర్శకులకు, ప్రేక్షకులకు ఇదే నా ప్రకటన అంటూ సవాల్ విసిరారు. మరి కరణ్ కి అవకాశాలిస్తారేమో చూద్దాం. కరణ్ బాలీవుడ్ తెరకు ఎంతో మందిని పరిచయం చేసి స్టార్ హీరో, హీరోయిన్లగా తీర్చి దిద్దారు. మరి ఇప్పుడాయన బాధ్యతల్ని ఎవరి తీసుకుంటారో? ఆయనేమి హీరోగా పరిచయం చేయమనడం లేదు. తండ్రి పాత్రలే కాబట్టి ఎవరైనా ముందుకు రావొచ్చు. చూద్దం కరణ్ ని ప్రోత్సహించేది ఎంతమందో.