2013లో వచ్చిన ‘కామసూత్ర 3డి’ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ సినిమాలో లీడ్ రోల్ చేసిన సైరా ఖాన్ తర్వాత పెద్దగా ఆఫర్స్ రాలేదు కానీ జనాలకు అలా గుర్తుండిపోయింది. ఆమె గుండెపోటుతో మరణించారు. రూపేష్ పాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మొదట షెర్లిన్ చోప్రాను లీడ్ రోల్‌గా అనుకున్నా..రకరకాల కారణాలతో ఆమె తప్పుకోవడంతో సైరా ఖాన్ ఆ అవకాశం ఇచ్చారు.
సైరా ఖాన్ హఠాన్మరణంపై విచారం వ్యక్తం చేస్తూ రూపేష్ పాల్ స్పందించారు. ‘సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం వల్ల కామసూత్ర 3డి చిత్రానికి సైన్ చేయడానికి ఆమె చాలా కష్టపడి అందరినీ ఒప్పించాల్సి వచ్చింది.’ అని అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
ఇక సంప్రదాయవాద ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం వల్ల, అలాంటి బోల్డ్ మూవీతో బాలీవుడ్ లోకి అడుపెట్టడం ఆమెకు ఛాలెంజ్ గా మారింది. కొన్ని నెలల తర్వాత ఆమె ఇంట్లో వాళ్లను ఒప్పించుకోగలగింది. కాస్త లేటైనా ఒక మంచి నటి దొరికిందనే సంతృప్తి కలిగింది. ఆమెలా ఎవరూ చేసుండేవారు కాదు’ అని రూపేష్ పాల్ తెలిపారు.
ఇక సైరా మృతి వార్త షాకింగ్ అనిపించింది. కానీ ఆమె మృతిని ఏ ఒక్క మీడియా సంస్థ కూడా పట్టించుకోకపోవడం మరింత బాధాకరం అనిపించింది. అందుకే ఆమె మృతిపై నేనే ఒక ప్రకటన విడుదల చేస్తున్నాను అన్నారు.