ఈడేంటి భయ్యా.. ప్రభాస్ ని తగులుకున్నాడు

ప్రతీసారి ఎవరో ఒక స్టార్ ని కెలికి కొట్టించుకునే స్దాయి దాకా వెళ్తూంటాడు కమల్ ఆర్ ఖాన్. కేవలం వివాదాస్పద వ్యాఖ్యలతో , నోటి కొచ్చిన ఎనాలసిస్ లతో కమల్ పాపులర్ అయ్యారు. ఎప్పుడూ ఇండస్ట్రీ ప్రముఖుల మీదా, చిత్రాలపైన ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ ఎప్పడూ వార్తలలో ఉంటాడు ఈ నటుడు. ఆ మధ్యన ఈతని వెర్రి మొర్రి చేష్టలు శృతిమించి పోవడంతో, తన సోషల్ మీడియా అకౌంట్స్ బ్యాన్ చేశారు.

ఇండియా మొత్తం బాహుబలి మేనియా తో ఊగిపోతున్న తరుణం లో , “బాహుబలి” చిన్న పిల్లలు చూసే కార్టూన్ మూవీ వలె ఉందని , తీవ్రవిమర్శలు చేసాడు. తాజాగా మరోసారి ప్రభాస్ మూవీ పై తీవ్ర విమర్శలు చేసాడు కమల్ ఆర్ ఖాన్.

తాజాగా సుజిత్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న “సాహో” మూవీ ఖచ్చితంగా అట్టర్ ప్లాప్ అవుతుందని అని ఏ కామెంట్స్ పాస్ చేసాడు. “సాహో” సినిమా టి-సిరీస్ చరిత్ర లోనే ఒక పెద్ద డిజాస్టర్ అవుతుంది, ఎందుకంటే దాని బడ్జెట్ 250 కోట్లు” అంటూ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. దాంతో ప్రభాస్ అభిమానులంతా ఇప్పుడు కమల్ ఆర్ ఖాన్ ని తిట్టడం మొదలెట్టారు.