నాకు హోమోసెక్సువల్ ఫ్రెండ్స్ ఉన్నారు…కాబట్టి

‘అ’ సినిమా వరకు తెలుగులో వరస పెట్టి సినిమా చేసింది రెజీనా కసాండ్ర. అయితే ఎందుకొచ్చిందో కానీ గ్యాప్ వచ్చేసింది. ఈ మధ్య తెలుగు సినిమాల్లో ఆమె పెద్దగా అవకాశాలు రావట్లేదనే చెప్పాలి. ఈ సిట్యువేషన్ లో రెజీనా ఓ బాలీవుడ్ సినిమాలో ఓ స్పెషల్ పాత్రలో కనిపించనుంది. సోనమ్‌కపూర్ ప్రధాన పాత్రలో ‘ఏక్ లడకీ కొ దేఖాతో ఐసా లగా’అనే హిందీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో సోనమ్‌కపూర్ ప్రేయసిగా రెజీనా కనిపించింది.

ఈ సినిమాలో సోనమ్, రెజీనా ఇద్దరూ లెస్బియన్స్ అని, వారిమధ్య ప్రేమకథే ఈ సినిమాలో ప్రధాన అంశం. షెల్లీ చోప్రా  దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 1న రిలీజ్ చేసారు. కాగా ఇప్పటికే విడుదల అయిన సినిమా కి విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల రివార్డులు కూడా దక్కుతున్నాయి. ఈ మూవీలో రెజీనా లెస్బియ‌న్ గా న‌టించింది.. సోన‌మ్ క‌పూర్ కు పెయిర్ గా ఆమె అత్యుత్త‌మ నట‌న‌ను క‌న‌బ‌రిచింది. తొలి అడుగులోనే అక్క‌డ మంచి విజ‌యం ల‌భించ‌డంతో మ‌రిన్ని అవ‌కాశాలు అమెకు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఈ ఉత్సాహంలో ఆమె మీడియాతో మాట్లాడింది.

సమాజంలో హోమోసెక్సువాలిటీ ని ఇప్పుడిప్పుడే యాక్స్పెక్ట్ చేస్తున్నారని ఆమె అన్నారు. అలాగే తను లెబ్సియన్ పాత్ర చేస్తున్నప్పుడు పెద్ద ఎక్కువగా ఆలోచించలేదని, ఎందుకంటే తనకు కొద్దిమంది హోమో సెక్సువల్ ఫ్రెండ్స్ ఉన్నారని ఆమె చెప్పారు. వాళ్లపట్ల తనకు కొంత సానుభూతి ఉందని చెప్పుకొచ్చారు. వారిని వారి దోవలోనే వదిలయ్యాలి కానీ నీతులు చెప్పే కార్యక్రమం చెయ్యకూడదని అని చెప్పారు.