ఈ బూతు ‘వీడియో’ లో ఉన్నది లక్స్ పాపే

నరసింహనాయుడు’ సినిమాలో లక్స్ పాపగా నటించిన ఆశా షైనీకి ఆ తర్వాత కొన్నాళ్లకి హఠాత్తుగా అవకాశాలు తగ్గిపోయాయి. ఆమధ్య ఎవరో చెబితే మయూరిగా పేరు మార్చుకుంది. దాంతో మళ్లీ ఇప్పుడు సుడితిరిగిందట. ‘ఆ ఇంట్లో..’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, ‘బ్రోకర్’, ‘చట్టం’ సినిమాలు చేసింది. తాజాగా ‘మనీ మనీ మోర్ మనీ’ సినిమాలో నటించింది. పేరు మార్చుకున్నాక తను నటించిన మూడు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడంతో ఆమె పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కింది. అంతవరకూ బాగానే ఉంది.

అయితే ఇప్పుడామె ముంబైలో బూతు వెబ్ సీరిస్ లో నటిస్తోంది. అయితే బాలీవుడ్ టాప్ బ్యానర్ ఏక్తా కపూర్ సంస్ద నుంచి వచ్చే వెబ్ సీరిస్ కావటంతో ఆమె ఒప్పుకుంది. 2019 తొలిరోజు ఏక్తా కపూర్ గంధి బాత్ 2 ట్రైలర్ విడుదల చేసింది.

తెలుగు లో లక్స్ పాపగా బాగా పాపులర్ అయిన ఆశాషైనీ, నేహా శెట్టి ల మధ్య శృంగార సన్నివేశాలు దుమ్ము రేపనున్నాయని చెప్తున్నారు. ఈ నెల 7 నుంచి ఈ సీజన్ 2 స్ట్రీమ్ కానుంది. నెట్ లో సంచలనం సృష్టిస్తున్న ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్ వేయండి…

https://www.youtube.com/watch?v=C_BoBsrzAuo

గత సంవత్సరం మే నెలలో విడుదలైన గంధి బాత్ కు ఇది సీక్వెల్. 2018 లోనే ఏక్తా కపూర్ అటు సినిమాలోనూ ..ఇటు వెబ్ సిరీస్ లోను హాట్ కంటెంట్ డోస్ బాగా పెంచింది. ఏక్తా కపూర్ 2018 లో విడుదల చేసిన సినిమా వెబ్ సిరీస్ లు అన్ని కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.

తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చుస్తే ఈ బోల్డ్ కంటెంట్ డోస్ మరికొంచెం పెరిగినట్టే కనిపిస్తుంది. గంధి బాత్ సీజన్ 2 లో 4 కథలు 4 ఎపిసోడ్స్ గా ఉండబోతున్నాయి. ఇంతకు ముందు ఏక్తా కపూర్ సిరీస్ లలో బోల్డ్ సీన్స్ ఉండేవి కానీ 2018 లో స్వయంతృప్తి అనే కాన్సెప్ట్ ని కొత్తగా తీసుకొచ్చింది ఏక్తా. ఇప్పుడు మళ్ళి ఈ సీజన్ 2 లో 2019 లో లెస్బియన్ సీన్స్ కాన్సెప్ట్ ని కొత్తగా ఇండియన్ బుల్లి తెర కు పరిచయం చేయనుంది ఏక్తా కపూర్.