Sarkaru Vaari Paata : పాన్ ఇండియా సినిమాలను దాటి ఆల్ టైం రికార్డులు సెట్ చేస్తున్న మహేష్.!

Sarkaru Vaari Paata :  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “సర్కారు వారి పాట” చిత్రంపై ఏ స్థాయి అంచనాలు ఇది వరకు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాపై అంచనాలుని అయితే ఒక్కసారిగా భారీ స్థాయిలోకి సినిమా నుంచి వచ్చిన మాస్ ట్రైలర్ తీసుకెళ్ళిపోయింది.
అయితే రీసెంట్ టైమ్స్ లో ఏ సినిమా కూడా ఇవ్వని మంచి ట్రీట్ ఈ సినిమా ట్రైలర్ తోనే ఇచ్చింది అందుకే బహుశా రికార్డు స్థాయి రెస్పాన్స్ ఈ చిత్రానికి వస్తుంది. ఇంకా ఎన్నో గంటల టైం బ్యాలన్స్ ఉన్నా కూడా అప్పుడే టాలీవుడ్ లో పలు పాన్ ఇండియా సినిమా రికార్డులను ఈ సినిమా అందుకుంది.
నిన్న వచ్చిన ట్రైలర్ కేవలం 14 గంటల్లోనే 24 మిలియన్ కి పైగా వ్యూస్ అందుకొని రాధే శ్యామ్, ట్రిపుల్ ఆర్(RRR) చిత్రాలను దాటి రికార్డు రెస్పాన్స్ కొల్లగొట్టేసింది. ఇది మాత్రమే కాకుండా టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్ లు అందుకున్న ట్రైలర్ గా కూడా ఈ సినిమా ఆల్ టైం రికార్డులు నమోదు చేసింది.
అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై దర్శకుడు కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు. సినిమా ట్రైలర్ కన్నా 100 రెట్లు అదిరిపోతుందని ప్రామిస్ ఇచ్చాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది.