పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయి. ఈ రెండు వ్యవస్థలు అంత కంటే ఎక్కువ అవినీతిపరుడైన వ్యక్తికి క్లీన్ చిట్ ఇచ్చాయి
అంటూ తనుశ్రీ దత్తా దేశంలోని రెండు కీలక వ్యవస్థలపై సంచలన ఆరోపణలు చేసారు. అలా చేయటానికి కారణం ఈ రోజు పోలీస్ లు ఆమె పెట్టిన కేసుని క్లోజ్ చేయటమే.
మీటూ ఉద్యమానికి ఇండియాలో శ్రీకారం చుట్టిన నటి తను శ్రీదత్తా. ఈ రోజు ఈమెకు పోలీసులు షాకిచ్చారు. గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తనుశ్రీ, సీనియర్ యాక్టర్ నానా పటేకర్ 2008లో ఓ షూటింగ్ సమయంలో తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసి సంచలనం రేపారు.
అయితే తనుశ్రీ తనపై చేసిన వ్యాఖ్యలను అప్పట్లో నానా పటేకర్ ఖండించారు. అలాగే నానా పటేకర్, తనుశ్రీదత్తా ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లోకేసులు కూడా పెట్టుకున్నారు. ఇద్దరి వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. మీ టూ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలలో ఆమెకు అనుకూలంగా ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదంటూ.. పబ్లిసిటీ కోసమేఆమె ఇదంతా చేస్తుందంటూ పోలీసులు అప్పట్లో ఆమెపై ఆరోపణలు కూడా చేశారు. అప్పుడు తనుశ్రీ పెద్ద ఎత్తున పోలీసులపై విరుచుకుపడింది.
తమకు సరైన ఆధారాలు దొరకనందున ఈ కేసులో విచారణను క్లోజ్ చేస్తున్నట్లు గురువారం పోలీసులు తెలిపారు.
దాంతో తను శ్రీ దత్తా తీవ్రంగా స్పందించారు.అయితే తాము కోర్టుకు వెళతామని తనుశ్రీ దత్తా లాయర్ తెలియజేశారు.