యాసిడ్ దాడి బాధితురాలు, సామాజిక కర్త లక్ష్మీ అగర్వాల్ జీవితకథతో రూపొందిస్తున్న తాజా చిత్రం చపాక్. దీపిక పదుకొనే కథానాయికగా మేఘన గుల్జార్ తెరకెక్కిస్తున్నారు. జనవరిలో సినిమా రిలీజవుతోంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంది. దీపిక అలుపెరగక పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ప్రమోషన్ చేస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతగా ఎంతో బాధ్యతను తీసుకున్న దీపిక ప్రచారంలో ఏ లోటూ రానివ్వడం లేదు.
తాజాగా యాసిడ్ ఎటాక్స్ బాధితులపై సమాజం స్పందన ఎలా ఉంటుంది? అన్నదానిని హెడెన్ కెమెరాల్లో చిత్రీకరించి దానిని చిత్రబృందం రివీల్ చేసింది. తాజా వీడియో చూశాక .. ఎమోషనల్ అనిపించడం ఖాయం. ముంబై కొలాబా అనే చోట సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసి జనాల ఫీలింగ్స్ ని రికార్డ్ చేశారు. యాసిడ్ దాడి వల్ల వికృతంగా మారిన దీపికను పలకరించేందుకు ఎవరూ సాహసించలేదు. దీపికతో పాటుగా మరో ముగ్గురు యాసిడ్ దాడి బాధితురాళ్లకు విచిత్రమైన సన్నివేశమే ఎదురైంది. ఆ వీడియో ఎన్నో విషయాల్ని అందరికీ అర్థమయ్యేలా చెబుతోంది. ఇక సినిమా ఏ మేరకు రీచ్ అవుతుంది? అన్నది చూడాలి.