సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలక మలుపు.. ఆనందంలో కుటుంబ సభ్యులు 

సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలక మలుపు.. ఆనందంలో కుటుంబ సభ్యులు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.  తొలుత సుశాంత్ మరణం ఆత్మహత్య అనుకున్నారు.  కానీ సుశాంత్ కుటుంబసభ్యులు అది ఆత్మహత్య కాదని హత్యని ఆరోపణలు చేశారు.  డీంతో మహారాష్ట్ర పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.  విచారణ సరిగా జరగడంలేదని, కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని పలువురు ఆరోపణలు చేశారు.  ఈలోపు సుశాంత్ తండ్రి తన కుమారుడి మృతి మీద బీహార్లో కేసు పెట్టారు.  దీంతో మహారాష్ట్ర పోలీసులకు, బీహార్ పోలీసులకు మద్య వివాదం మొదలైంది.  
సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలక మలుపు.. ఆనందంలో కుటుంబ సభ్యులు
 
మరోవైపు కేసు సత్వరం పరిష్కారం కావాలంటే సీబీఐ చేతికి వెళ్లాలనే డిమాండ్ మొదలైంది.  ఈమేరకు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.  కానీ మహారాష్ట్ర పోలీసులు మాత్రం సీబీఐ విచారణ డిమాండును తోసిపుచ్చారు.  అయితే తాజాగా పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు కేసును సీబీఐ చేతికి అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.  ఇప్పటివరకు ఈ కేసులో సేకరించిన వివరాలన్నింటిని కూడా సీబీఐకు అప్పగించాలని మహరాష్ట్ర పోలీసుల్ని ఆదేశించింది.  
 
మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడ ఈ కేసు విషయంలో సీబీఐకు సహకరించాలని కోరింది.  అవసరమైతే  కొత్తగా కేసు నమోదు చేసే అవకాశం కూడా సీబీఐకు ఇచ్చింది సుప్రీం కోర్టు.   సుప్రీం ఆదేశాలతో సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.  సీబీఐ విచారణ ద్వారా తమ కుమారుడికి న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామని అన్నారు.  పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అనేక మంది ప్రజలు కూడా సీబీఐ పరిధిలోకి కేసు వెళ్లడం మంచి పరిణామమని అంటున్నారు.