హిందీ బిగ్ బాస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లకు ఆ షో కంటెస్టెంట్, నటి బాబీ డార్లింగ్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె ఇప్పుడు తన భర్త రమ్నిక్ శర్మ నుంచి విడాకులు కోరుతూ పిటీషన్ వేసి వార్తల్లో నిలిచింది. అయితే ఇందులో వింతేముంది చాలా మంది విడాకుల కోసం కోర్టుకు ఎక్కుతారు అంటారా…
అసలు ట్విస్ట్ ఏమిటంటే..ఆమె అసలు మొదట స్త్రీనే కాదు. . లింగ మార్పిడి చేసుకుని తన బాయ్ ఫ్రెండ్ రమ్నిక్ శర్మను ఫిబ్రవరి 2016లో పెళ్లాడింది. అయితే పెళ్లయిన ఏడాదికే ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అవి పెరిగి పెద్దవై రమ్నిక్ పై గృహ హింస కేసు కూడా పెట్టే స్దాయికి వచ్చాయి. పలు హిందీ టీవీ షోలతో పాటు చిత్రాల్లో నటించిన ఆమె.. కోర్టులో తనకు న్యాయం కావాలంటోంది.
అంతేకాదు తమ వివాహంలో అసహజ శృంగారం ఉందంటూ ఆరోపిస్తోంది. అయితే రమ్నిక్ శర్మ వాదన మరోలా ఉంది. లింగ మార్పిడి తర్వాత తాను గర్భం దాల్చుతాను అని అబద్దం చెప్పి తనను పెళ్లి చేసుకుందని ఆరోపిస్తున్నాడు. ఇప్పుడేమో అలాంటిదేమీ లేదంటున్నాటోందని చెప్తున్నారు.
బాబీ డార్లింగ్ మాత్రం ..తమ వైవాహిక జీవితం సినిమాల్లో కంటే ఫేక్‌గా సాగిందని, బయటి ప్రపంచం మేము సంతోషంగా ఉన్నామని నమ్మింది. కానీ లోపల అలాంటి దేమీ లేదని వాదిస్తున్నారు. అందుకే తాను విడాకులు కోరుకుంటున్నట్లు బాబీ డార్లింగ్ తెలిపారు.
బాబీ డార్లింగ్ తమ వివాహం రద్దు చేయాలని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది. దీంతో పాటు తన భర్త నుంచి రూ. 2 కోట్ల భరణం కావాలని, అతడికి గిఫ్టుగా ఇచ్చిన ఫ్లాట్ తనకు తిరిగి చెందేలా చేయాలని కోరుతోంది.