Alia Bhat: ఎన్టీఆర్ కు హిందీ ఇంగ్లీష్ మాట్లాడటం రాదంటూ కామెంట్స్ చేసిన… అలియా భట్!

Alia Bhat: బ్యూటీ అలియాభట్ మొట్టమొదటిసారిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా అలియా ఏమి సీత పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అలియా భట్, ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్య ఓ సరదా సన్నివేశం కొనసాగింది.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆలియాభట్ కొమరం భీమ్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ భాష గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నేను ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతిచోట ఎన్టీఆర్ తెలుగులోనే మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియలేదని ఎవరైనా ట్రాన్స్ లేట్ చేసి చెబుతారేమోనని ఎదురు చూసే దాన్ని అని ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు హిందీ ఇంగ్లీష్ మాట్లాడటం రాదు అంటూ పరోక్షంగా మాట్లాడారు.

ఈ విధంగా అలియా భట్ ఎన్టీఆర్ భాష గురించి మాట్లాడటంతో ఎన్టీఆర్ స్పందిస్తూ… మాకు హిందీ ఇంగ్లీషు భాషలు వచ్చు కాకపోతే మీకు అది అర్థం కావడం లేదని తనపై రివర్స్ పంచ్ వేశారు.ఇక ఎన్టీఆర్ పంచ్ కు ఏ మాత్రం తగ్గకుండా అలియాభట్ స్పందిస్తూ లేదు మీరు హిందీ ఇంగ్లీష్ లో మాట్లాడలేదని నవ్వుతూ చెప్పారు. ఇక మనకు తెలిసిన విషయమేమిటంటే ఎన్టీఆర్ హిందీ ఇంగ్లీష్ ఎంతో అనర్గళంగా మాట్లాడగలడు అనే సంగతి మనకు తెలిసిందే. రాజమౌళి చిత్రం ద్వారా వీరిద్దరూ కలిసి నటించడమే కాకుండా తాజాగా కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో కూడా అలియా సందడి చేయనుంది.