పెళ్ళికి వయసు ఏమిటి అన్నాడు వెనకటికి ఓ మహాను భావుడు . నిజమే వయసు దాటిపోయినా మనసులో కోరికలు ముసురుతూనే ఉంటాయి . అంతవరకు పెళ్లేందుకులే అనుకున్న వారు తమకు నచ్చినవాడు కనిపించగానే మనసు అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది . అతని తలపుల్లోనే గడుపుతుంటారు . పరిచయం స్నేహంగా మారుతుంది , స్నేహం సాన్నిహిత్య మవుతుంది . అప్పుడు అనిపిస్తుంది అతనితోనే జీవితమంతా ఉండి పోవాలనిపిస్తుంది .
ఇప్పుడు సరిగ్గా సుస్మితా సేన్ పరిస్థితి కూడా అదే . సుస్మిత హైద్రాబాద్లో పుట్టి పెరిగింది . 1994లో ఫెమినా మిస్ ఇండియా గా ఎన్నికైంది . మిస్ యూనివర్స్ పోటీల్లో మూడవ స్థానాల్లో వచ్చింది . 1996లో దస్తక్ సినిమాతో నటిగా పరిచయం అయ్యింది .
వయసులో ఉండగా పెళ్ళిచేసుకోవాలని అనిపించలేదేమో 2000 సంవత్సరంలో ఒక పాపను దత్తత తీసుకుంది . 2010లో మరో పాపను పెంచుకోవడం మొదలు పెట్టింది . మూడు నెలల క్రితం రొహ్మన్ షా అనే యువకుడితో ఓ కార్యక్రమంలో పరిచయం ఏర్పడింది . ఆ పరిచయం అభిమానంగా , ఆ అభిమానం ప్రేమగా మారింది . ఇంట్లో తన ఇద్దరు పిల్లలకు కూడా రొహ్మన్ షా ను పరిచయం చేసింది .
ఇప్పుడు పార్టీలకు , డిన్నర్లకు సుస్మిత రొహ్మన్ షా తో కలసి వెడుతుంది . బహుశ వీరిద్దరూ వచ్చే సంవత్సరం వివాహం చేసుకోవచ్చని అంటున్నారు .
42 సంవత్సరాల వయసులో సుస్మిత పెద్ద పాపకు వివాహం చెయ్యాల్సింది తాను పెళ్లి పీటలు ఎక్కబోతుంది , అదీ ఇద్దరు కూతుళ్ళ (పెంపుడు )తల్లిగా ..!