బోయ్ ఫ్రెండ్ తో స్టార్ హీరోయిన్ ఎంగేజ్మెంట్

‘మదరాసు పట్టణం’ ద్వారా తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన అమీ జాక్సన్ కు నిశ్చితార్దం అయ్యింది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె… అందాల ఆరబోతకు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ముందుకు పోతోంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌లో మాత్రం ఇతర హీరోయిన్లతో పోటీ పడుతుంటుంది. రీసెంట్ గా‘2.0’తో ఆకట్టుకున్నంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జోడీగా రోబో పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. అమీ జాక్సన్ కొత్త ఏడాదిలో అభిమానులకు శుభవార్త అందించింది.

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటో, అమీ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. న్యూఇయర్‌ సందర్భంగా జాంబియాలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని అమీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు.

‘1 జనవరి 2019.. మన జీవితాల్లో కొత్త ప్రయాణం. ఐ లవ్యూ. నన్ను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతున్నందుకు ధన్యవాదాలు’ అని పేర్కొంటూ ఫొటోను పోస్ట్‌ చేశారు. అయితే పెళ్లెప్పుడన్న విషయాన్ని మాత్రం అమీ వెల్లడించలేదు. తెలుగులో ‘ఎవడు’, ‘అభినేత్రి’ చిత్రాల్లో నటించారు అమీ.