ఎప్పటికప్పుడు తన గురించిన ప్రతీ విషయం ఫ్యాన్స్ తో పంచుకునే బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. తన వెన్నెముకకు ప్రమాదకరమైన క్షయ వ్యాధి సోకిందని అమితాబ్ చెప్పారు. అయితే ఇది జరిగి చాలా కాలం అయ్యింది. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ సీజన్‌లో ఓ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ విషయం చెప్పారు.
అమితాబ్ మాట్లాడుతూ.. 2000 సంవత్సరంలో కేబీసీ తొలి సీజన్ సమయంలో తనకు వెన్నెముక క్షయ ఉందన్న విషయం తెలిసిందని, ఆ సమయంలో తాను చాలా ఇబ్బందులు పడ్డానని అన్నారు.
ఆ సమయంలో కుర్చీలో కూర్చుంటే భరించలేని నొప్పి వచ్చేదని, ఇప్పుడిప్పుడే బయటపడ్డానని అన్నారు. ఈ వ్యాధి ఉన్న సమయంలో నొప్పి తగ్గేందుకు ఎన్నో మందులు వాడాల్సి వచ్చిందని చెప్పారు. ఈ వ్యాధితో ప్రపంచంలో ఎంతో మంది బాధపడుతున్నారని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేయాల్సి ఉందని అమితాబ్ పేర్కొన్నారు.
అందుకే ఆయన క్షయవాధిపై అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గతంలో రెండు టీబీ మొబైల్ వాహనాలను అమితాబ్ ప్రారంభించారు. మొబైల్ వాహనాల ద్వారా వారానికి రెండు సార్లు ప్రతీ వూరు తిరుగుతూ క్షయ రోగులకు పరీక్షలు నిర్వహించనున్నారు.