ఈ బాలీవుడ్ హీరో అవైటెడ్ సినిమా డిజప్పాయింటింగ్ రివ్యూస్..!

ఒకప్పుడు బాలీవుడ్ లో సినిమాలు ఏ లెవెల్లో ఉండేవో ఏ రేంజ్ వసూళ్లు కొల్లగొట్టేవో అందరికీ తెలిసిందే. పైగా హిందీలో భారీ వసూళ్లు ప్రస్తావన వస్తే స్టార్ హీరో అమీర్ ఖాన్ పేరు తప్పక ఉండాల్సిందే. టాప్ 5 లో తనవి మినిమమ్ రెండు మూడు సినిమా తప్పక ఉంటాయి.

ఆ రేంజ్ లో వసూళ్లు అందుకునే అమీర్ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర చతికిల పడ్డాడు. దీనితో ఒక హిట్ కోసం అంతా ఎదురు చూస్తుండగా దర్శకుడు అద్వైత్ తో చేసిన సినిమానే “లాల్ సింగ్ చద్దా”. ఈ సినిమాకి ఎప్పుడు లేని విధంగా తాను ప్రమోషన్స్ చేసుకున్నాడు.

తెలుగులో కూడా ఎన్నో సార్లు ప్రమోషన్స్ చేసాడు. అయితే వీటిని పక్కన పెడితే ఈ సినిమాకి ఆడియెన్స్ రిలీజ్ కి ముందే షాకిచ్చారు. ఇదివరకు పలు బాలీవుడ్ సినిమాలకు నెగిటివ్ సెగ తగిలించింది కానీ అమీర్ సినిమా విషయంలో మాత్రం చాలా ఎక్కువే అని చెప్పాలి.

సరే ఇది ఎప్పుడూ ఉండేదే సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ వస్తే ఇవేమి నిలబడవు అని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా సినిమాకి షాకింగ్ రివ్యూస్ నమోదు అవుతున్నాయి. బాలీవుడ్ విమర్శకులే సినిమా బాగాలేదని చెప్పేస్తున్నారు.

దీనితో సినిమా కోసం నెగిటివ్ ట్రెండ్ చేసిన వారు అంతా కూడా హ్యాపీనే అని చెప్పాలి. కానీ అమీర్ మాత్రం భారీ నష్టాలు చూడడం తప్పదని చెప్పి తీరాలి. మరి మళ్ళీ తన కం బ్యాక్ ఎప్పుడు ఉంటుందో అని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నారు.