Amir Khan: అదే నా ఆఖరి సినిమా కావచ్చు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అమీర్ ఖాన్.. అసలేం జరిగిందంటే!

Amir khan: బాలీవుడ్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో పలు కమర్షియల్ యాడ్స్ లో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు అమీర్ ఖాన్. ఈయనకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. మనకు సంబంధించిన విషయాలతో పాటు అప్పుడప్పుడు వ్యక్తిగత విషయాలలో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు అమీర్ ఖాన్. అందులో భాగంగానే ఇప్పుడు మరోసారి వార్తల్లో ఆయన పేరు వినిపిస్తోంది.

ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం సీతారే జమీన్ పర్ విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 20వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలు పెట్టేశారు మూవీ మేకర్స్.. ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమిర్, తాను చాలా ఏళ్లుగా కలలు కంటున్న మహాభారతం ప్రాజెక్ట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మహాభారతం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ..

ఇది చిన్నప్పటి నుంచి నా కల. ప్రపంచంలో ఉన్న ప్రతీ భావోద్వేగం, ప్రతి మానవ సంబంధం మహాభారతంలో కనిపిస్తుంది. నేను దాన్ని సినిమా రూపంలో తీయాలనుకుంటున్నాను. అయితే ఆశ్చర్యకరంగా ఈ ప్రాజెక్ట్ తన కెరీర్‌ లో చివరి సినిమా కావచ్చు అని కూడా తెలిపారు. ఇంతటి గొప్ప కథ తర్వాత ఇంకేం చేయాలో నాకు అర్థం కాకపోవచ్చు. పని చేస్తూనే చనిపోవాలని ఉంది. కానీ బహుశా ఇది నా చివరి సినిమా అయి ఉండవచ్చు అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. లేదు సార్ మహాభారతం సినిమా తర్వాత కూడా మీరు ఇంకా మంచి మంచి సినిమాలను తీయాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి అమీర్ ఖాన్ అన్నట్టు మహాభారతం సినిమా లాస్ట్ సినిమా అవుతుందా లేదంటే ఇంకా కొన్ని సినిమాలలో నటిస్తారా అన్నది చూడాలి మరి.