Amir Khan: జీవితాంతం రీమేక్ సినిమాలే చేస్తా.. అమీర్ ఖాన్ కామెంట్స్ వైరల్.. అసలేం జరిగిందంటే!

Amir khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. అమీర్ ఖాన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుస సినిమాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ సినిమా సితారే జమీన్ పర్. ఇందులో జెనీలియా కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో అమీర్ ఖాన్ తనకు ఎదురైనా ఒక ప్రశ్నకు చాలా ఘాటుగా స్పందించారు.

కాగా ఇటీవ‌ల బాలీవుడ్ వ‌రుస‌గా రీమేక్ లు చేస్తూ ఫ్లాపుల్ని ఎదుర్కొంటోంద‌ని ఒరిజిన‌ల్ కంటెంట్ క్రియేష‌న్ లో వెన‌క‌బ‌డింద‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సితారే జ‌మీన్ పర్ స్పానిష్ సినిమా కాంపియోన్స్ కి రీమేక్. అయినా ఒరిజిన‌ల్ స్పానిష్ సినిమా ఎంత‌మంది చూశారు? అని అమీర్ ప్ర‌శ్నించాడు. నేను ఆ సినిమాని య‌థాత‌థంగా కాపీ పేస్ట్ చేయ‌లేదు. నా కెరీర్ లో రీమేక్ సినిమా అయిన గ‌జినీ మూవీతో నేను విజయం సాధించాను.

అంతేకాదు ఇకమీదట జీవితాంతం రీమిక్స్ సినిమాలే చేస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో అన్ని ఇండస్ట్రీలో ఎక్కువగా రీమేక్ సినిమాలే తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.