ఆరేళ్ళ పాటు క్యాన్సర్ కు సంబంధించిన చికిత్సను భరించి ఈ మధ్యనే సంజయ్ దత్ బయోపిక్ సంజు లో వెండితెరపైన ఎంట్రీ ఇచ్చింది… మనీషా కొయిరాలా. అలాగే లవ్ స్టోరీస్ అనే వెబ్ సీరిస్ లోనూ నటించింది. అయితే ఆమె తనలాగ మరికొంత మంది కాన్సర్ బారిన పడకూడదనే ఉద్దేశ్యంతో క్యాన్సర్ గురించిన అనుభవాలు హీల్డ్ అనే పేరుతో పుస్తకంగా రాశారామె.
క్యాన్సర్ అంటే మరణమే అనుకొంటారు ఆ అపోహను పోగోట్టాలనే నేను Healed బుక్ రాశాను. క్యాన్సర్ వ్యాధితో బాధపడటం నా జీవితంలో ఒక భాగం అంతే .హస్పిటల్ లో ఆరు నెలల పాటు చికత్సా తీసుకోన్నారామె. ఆ తర్వాత ఆరేళ్ళపాటు ఆ వ్యాధితో పోరాడి జయించారు. రచయిత జాతీయ అవార్డు గ్రహిత నీలమ్ కుమార్ తో కలిసి హీల్డ్ పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ సంస్థ ప్రచురించింది. హీ క్యాన్సర్ గేల్ మి న్యూ లైవ్ అన్నాది ట్యాగ్ లైన్..
ఇక ఈ పుస్తకంలో ఆమె ఏమి రాసిందీ అంటే… ‘హీల్డ్’ అనే పేరుతో రాసిన ఈ పుస్తకంలో ఆమె పలు విషయాలను ప్రస్తావించింది. ఆమెకి క్యాన్సర్ రావడానికి కారణంగా విచ్చలవిడిగా తిరగడం, కట్టుబాట్లను మీరడమేనని చెప్తోంది మనీషా. తన చెడు ప్రవర్తన కారణంగానే క్యాన్సర్ బారిన పడినట్లు వెల్లడించింది. ఎన్నో చీకటి రోజులను, ఏకాంత రాత్రులను గడిపినట్లు, వాటి నుండి ఎలా బయటపడ్డానో తలచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందని అన్నారు.
మనీషా మాట్లాడుతూ,…. ”నా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ప్రపంచమే నా కాలు కింద ఉందని విర్ర వీగింది నిజం. క్షణం తీరిక లేని షూటింగ్ లతో 1999లో శారీరకంగా, మానసికంగా చాలా బాధపడ్డాను. దానిలో నుండి బయట పడడానికి తాగుడు ఒక్కటే మార్గమని భావించా. అప్పటికీ నా ఫ్రెండ్స్ ఎంతగా హితబోధ చేసినా వినలేదు. ఆ తర్వాత నా జీవితంలో క్యాన్సర్ ప్రవేశించింది. అది ఒక బహుమతిగానే వచ్చిందని అనుకుంటాను. నా ఆలోచనలు మారాయి. నా దృక్పథంలో మార్పు వచ్చింది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటున్నాను. అయితే అలాంటి బహుమతి ఇంకెవ్వరికీ రాకూడదని అనుకుంటున్నా ” అంటూ చెప్పుకొచ్చింది.