విజయ్ దేవరకొండ అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. అతనికి దక్షిణాదిన ఉన్న క్రేజ్ అతని ప్రతిభను చూసి అతనితో సినిమాలు చేయాలనీ బాలీవుడ్ నిర్మాతలు ఉత్సాహంగా ఉన్నారు. అతను ఊ అంటే చాలు హిందీలో పరిచయం చేయాలనీ ఉబలాట పడుతున్నారు.
ఈ క్రమంలో అతని హిందీ చిత్ర రంగప్రవేశానికి రంగం సిద్ధం అయింది అని సమాచారం. తెలుగులో ‘డియర్ కామ్రేడ్’ ప్లాప్ అయినా అతని కెరీర్కి కలిగిన నష్టమేమీ లేదని తెలుస్తూనే ఉంది. అటు పూరి జగన్నాధ్ సినిమా ఇటు క్రాంతి మాధవ సినిమాలు ఉన్నాయి.
ఇదే సరైన సమయమని హిందీ చిత్ర సీమ గురించి కూడా విజయ్ ఆలోచిస్తున్నాడట.