బాలీవుడ్ యువ నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. సుషాంత్ ఆత్మహత్యకు నెపోటిజం కూడా ఓ కారణమని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. పలువురు సెలబ్రిటీలు ఆ వాదనని బలపరిచారు. ఈ నేపథ్యంలో బీజీపీ నేత, ప్రముఖ న్యాయవాది రమణస్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. సుషాంత్ కేసును సీబీఐకి అప్పగించి విచారించాలని డిమాండ్ చేసారు. అలా విచారణ చేపట్టినప్పుడే అసలైన వాస్తవాలు బయటకు వస్తాయ న్నారు. ఈనేపథ్యంలోనే బాలీవుడ్ అగ్ర హీరోలు సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ ల గురించి సంచలన వ్యాఖ్యలతో కూడిన ట్వీట్లు చేసారు.
బాలీవుడ్ లో ఏ ఖానిని వదలకుండా విచారించాలని డిమాండ్ చేసారు. దేశ, విదేశాల్లో ఉన్న వారి ఆస్తులపై సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. ముఖ్యంగా ఆ ముగ్గురు ఖాన్ ల ముసుగులు తొలగించడంలో ఎంత ఏమాత్రం ఆలస్యం చేయకూడదని ఆగ్రహం వ్యక్తం చేసారు. దుబాయ్ లోని వారి ఆస్తులపై తక్షణం విచారణ చేపట్టాలన్నారు. ఖాన్ లకు ఆస్తులు ఎవరు బహుమతి గా ఇచ్చారనే విషయాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేసారు. చట్టానికి ఎవరూ చుట్టాలు కాదని..చట్టం ముందు అందరూ సమానమేనన్నారు. కాబట్టి వారి ఆస్తులను సిట్, ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలతో విచారణ జరిపించి వాస్తవాలు బయట పెట్టాల న్నారు.
సుషాంత్ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు సెలబ్రిటిల్నీ పోలీసులు విచారించారు. కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ ని కూడా విచారించాలని డిమాండ్లు వ్యక్తం అయ్యాయి. పలువురు రాజకీయ నేతలు, ఎంపీ, నటి రూపా గంగూలితోపాటు నెటిజన్లు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపించారు. కర్ణిసేన లాంటి సంఘాలు ఉద్యమాలు చేయడానికి ముందుకొ చ్చాయి. ఈ నేపథ్యంలో సుబ్రమణ్యా స్వామి తాజా వ్యాఖ్యలు బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమలతో పాటు ప్రజల్లోనూ చర్చనీ యాంశంగా మారాయి.