అర్జెంట్ గా బయలుదేరిన వైఎస్ జగన్ – స్ట్రాంగ్ డోస్ పడబోతోంది నిమ్మగడ్డకి ? 

Biug secret behind YS Jagan's Anantapur visit 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పంచాయతీ ఎన్నికలను కోరుకోలేదు.  సర్వశక్తులు ఒడ్డి వాటిని వాయిదా వేయాలనే చూశారు.  ఇందుకు కారణం ఓటమి భయం మాత్రం కాదు.  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసీ పదవిలో ఉండగా ఎన్నికలు జరగకూడదనే పంతమే.  నిమ్మగడ్డ సైతం తన హయాంలోనే ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికలు అయ్యాకే పదవి నుండి దిగిపోవాలని పోరాడారు.  చివరికి నిమ్మగడ్డదే పైచేయి అయింది.  హైకోర్టు డివిజనల్ బెంచ్ ఎన్నికలు పెట్టమని ఉత్తర్వులు ఇవ్వగా సుప్రీం కోర్టు సైతం ఆ నిర్ణయాన్ని సమర్థించింది.  దీంతో ఎన్నికలకు వెళ్లడమే తప్ప మరొక మార్గం లేకుండా పోయింది ముఖ్యమంత్రికి.  అయితే జగన్ ఎన్నికలు వద్దు అనడానికి కారణం ఓటమి భయమేనని ప్రత్యర్థి వర్గాలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. 
 
Biug secret behind YS Jagan's Anantapur visit 
Biug secret behind YS Jagan’s Anantapur visit
ఇక నిమ్మగడ్డ అయితే పూర్తి అధికారాలు ప్రయోగించి తనకు అడ్డు వస్తారని భావించిన అధికారులను పక్కకు నెట్టేశారు.  వైసీపీ ఎక్కువగా దృష్టి పెట్టిన ఏకగ్రీవాల ప్రక్రియను టార్గెట్ చేశారు.  ఎక్కడైనా బలవంతపు ఏకగ్రీవాలు జరిగినట్టు తెలిస్తే ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారు.  దీంతో జగన్ అలర్ట్ అయ్యారు.  ఏకగ్రీవ ప్రక్రియ ఎటి పరిస్థితుల్లోనూ ఆగకూడదని భావిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఆయన ఫిబ్రవరి 1న అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.  అక్కడ ఉచిత రేషన్ పంపిణీ వాహనాలను ప్రారంభించనున్నారు.  అయితే ఈ పర్యటన వెనుక ఇంకొక ప్రధాన కారణం ఉందని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు.  ఈ టూర్లో జగన్ జిల్లా నేతలతో సమావేశమవుతారట.  సమావేశంలో ప్రధాన ఎజెండా ఏకగ్రీవాలేనట.  
 
జిల్లాలో వీలైనన్ని ఎక్కువ పంచాయతీలను ఏకగ్రీవాల ద్వారానే  దక్కించుకోవాలని, ఎక్కడ బలవంతపు ప్రక్రియ ఉండకూడదని, ఒకవేళ అలాంటివి జరిగి ఈసీ చేతికి చిక్కితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతారట.  ఎన్నికలంటే భయపడుతున్నామని ప్రత్యర్థులు అనుకుంటున్నారు.  జనం మనల్ని ఓడిస్తారనే భ్రమలో ఉన్నారు.  వారందరికీ సమాధానం గెలుపు మాత్రమే కాదని మెజారిటీ స్థానాలనుయ్ ఏకగ్రీవం చేసుకుని తాను ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం కూడ లేదని తెలియజెప్పాలని టార్గెట్ పెట్టారట.  మొత్తానికి లోకల్ బాడీ ఎలక్షన్లలో ఫ్యాన్ స్పీడుకు ఆపొనెంట్స్ ఉక్కిరిబిక్కిరి అయిపోవాలనేది జగన్ స్ట్రాటజీ.  ఆ ప్రత్యర్థుల్లో నిమ్మగడ్డ కూడ ఉంటారనేది నిర్వివాదాంశం.