నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి ఎప్పుడు మొదలుపెడతారనే చర్చ ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో బలంగా నడుస్తుంది. నిన్నమొన్నటివరకూ అంటే చంద్రబాబు జైల్లో ఉండటం వల్ల ఏమాత్రం వీలుకాలేదు అనేది నిర్వివాదాంశం అనుకుంటే… చంద్రబాబు బయటకు వచ్చారు, కంటి ఆపరేషన్ కు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆపరేషన్ అనంతరం చినబాబు మళ్లీ పాదయాత్ర మొదలుపెడితే కరెక్ట్ గా ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
లోకేష్ సెప్టెంబర్ 9 దాకా యువగళం యాత్ర సాగించిన సంగతి తెలిసిందే. మొదట్లో తారకరత్న మరణవార్త, అనంతరం మరికొన్ని సమస్యలతో ఒకటి రెండు సార్లు కామాలు పెట్టినా… కంటిన్యూ చేశారు. ఇందులో భాగంగా చంద్రబాబు అరెస్ట్ సమయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం, పొదలాడ గ్రామంలో పాదయాత్రను మధ్యలో ఆపేశారు. నాటినుంచి విజయవాడ – ఢిల్లీ వయా హైదరాబా అన్నట్లుగా లోకేష్ బిజీ షెడ్యూల్ నడిచింది.
అయితే చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో ప్రస్తుతానికి మధ్యంతర బెయిల్ దొరికింది. ఈ నెలలో మరో ఐదు రోజుల్లో సుప్రీంలో క్వాష్ పై కూడా క్లారిటీ వచ్చేస్తుంది! దీంతో… వీలైనంత తొందరగా చినబాబు యువగళాన్ని రీస్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు తమ్ముళ్లు. నిన్నటివరకూ ఒకలెక్క, ఇప్పటినుంచి ఒక లెక్క అన్నట్లుగా… తండ్రి అరెస్ట్ అనంతరం దెబ్బ తిన్న పులిలా లోకేష్ రంగంలోకి దిగాలని అంటున్నారు.
గాయపడ్డ సింహం స్వాసనుంచి వచ్చే వేడి.. గర్జన కంటే భయంకరంగా ఉంటుందన్నట్లుగా కొనసాగాలని అంటున్నారు! పవన్ వారహి యాత్రలతో యువగళాన్ని పోల్చొద్దనేది మరో సలహాగా ఉంది. పవన్ ఫుల్ టైం పొలిటీషియన్ కాదనేది జనసేన నేతలు, కార్యకర్తలు సైతం ఆఫ్ ది రికార్డ్ ఒప్పుకుంటున్న పరిస్థితి. కానీ… చంద్రబాఉ, లోకేష్ ల పరిస్థితి అలా కాదు. గెలిచినా రాజకీయమే చేయాలి, ఓడినా రాజకీయమే చేయాలి… వారికి తెలిసిందల్లా అదే! మరో వ్యాపకం వారికి లేదు!
అందువల్లే… ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో… ఇంక మిగిలిఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా పూర్తి చేయాలని కోరుతున్నారు తమ్ముళ్లు. దీనికోసం మరో 50 రోజులు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన చూసుకుంటే… డిశెంబర్ లో ఈ యాత్ర పూర్తయిపోతుంది. ఇక జనవరిని నుంచి ఉమ్మడి ప్రచారాలు మొదలుపెట్టొచ్చని అంటున్నారు.
మరి ఈ సమయంలో నారా లోకేష్… ఆ పెండిండ్ యాత్రను పూర్తి చేసేస్తారా.. మిగిలిన నాలుగు జిల్లాల్లోనూ నడిచేస్తారా.. ఫలితంగా ఎన్ని ఇబ్బందులు, మరెన్ని ఆంటంకాలు ఎదురైనా కూడా పాదయాత్ర పూర్తి చేసిన నాయకుడిగా చరిత్ర సృష్టిస్తారా అన్నది వేచి చూడాలి!