వైసీపీకి అతి పెద్ద సమస్య సజ్జల రామకృష్ణారెడ్డి.?

వైసీపీ ముఖ్య నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. యువజన శ్రామిక రైతు కాంగ్రెష్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి రైట్ హ్యాండ్. పార్టీలో నెంబర్ టూ పొజిషన్‌లో సజ్జల వున్నారు. ఆయన ప్రభుత్వ సలహాదారు కూడా. క్యాబినెట్ ర్యాంక్ వుందాయనకి. పైగా, సకల శాఖా మంత్రి.. అనే గుర్తింపు కూడా వుంది. అంతేనా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భాషలో అయితే డిఫాక్టో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి. సరే, సకల శాఖ మంత్రి.. డిఫాక్టో సీఎం.. ఇవన్నీ రాజకీయ వెటకారాలనుకోండి.. అది వేరే సంగతి. వైసీపీలో అత్యంత కీలక నేత అయినప్పుడు, ప్రభుత్వ సలహాదారు కూడా అయినప్పుడు కీలకమైన విషయాల్లో ‘తేలిగ్గా’ సజ్జల ఎలా మాట్లాడేయగలుగుతున్నారు.?

‘మాట తప్పడు.. మడమ తిప్పడు..’ ఇదీ జగన్ నినాదం. అంతే కాదు, ‘మాట ఇచ్చి తప్పితే, చెప్పులు చూపించాలి.. పదవిలోంచి దించేయాలి..’ అని స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు పిలుపునిచ్చారాయె. అలాంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సీపీఎస్ రద్దు విషయమై ఎన్నికల హామీ ఇచ్చి.. దాన్ని నెరవేర్చలేకపోతే, ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అప్పట్లో అవగాహన లేక ఏదేదో చెప్పేశారు..’ అంటూ సజ్జల ఎలా వ్యాఖ్యానిస్తారు.? వైఎస్ షర్మిల వివాదంలో, ‘వైఎస్ జగన్ ఎంత చెప్పినా వినకుండా ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారు..’ అని ఎలా నఅగలుగుతారు.?

తాజాగా, సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించేశారు. అదీ కర్నూలు న్యాయ రాజధాని విషయంలోనట. దానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం వైసీపీ సర్కారుకి అనుకూల తీర్పు ఏమీ ఇవ్వలేదు కదా.? సజ్జల చాణక్యం ఏమైపోయింది.? ఆయన మేధావితనం ఏమైపోయింది.? వైసీపీని ఎందుకాయన ఇరకాటంలో పడేస్తున్నారు.?