వైసీపీ వర్సెస్ జనసేన.! ఇలా ఎలా మారిందబ్బా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ‘వారాహి విజయ యాత్ర’ తర్వాత, జనసేన పార్టీ ఈక్వేషన్ మారింది.! వైసీపీ వర్సెస్ జనసేన.. ఈ ఈక్వేషన్ నానాటికీ బలపడుతోంది. రాష్ట్రంలో రెండే ప్రధాన రాజకీయ పార్టీలు.. ఒకటేమో అధికార వైసీపీ, ఇంకోటేమో జనసేన పార్టీ.. అన్నంతలా రాజకీయం మారిపోయింది.

నారా లోకేష్, యువగళం పాదయాత్ర చేస్తున్నా, పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ ముందు తేలిపోయింది. వాస్తవానికి నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు.. బ్రేకుల్లేకుండా. జనసేన అధినేత అలా కాదు, వారాహి యాత్ర పేరుతో, విహార యాత్రలన్నట్టు చేశారు.

కానీ, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. గతంలో కేవలం సినీ అభిమానులే పవన్ వెంట కనిపించేవారు. మహిళలు తక్కువగా వుండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పవన్ కళ్యాణ్ బహిరంగ సభలకు మహిళలు, వృద్ధులూ, మధ్య వయస్కులు కూడా చాలా ఎక్కువగా వస్తున్నారు.

ఇలాంటి ఈక్వేషన్‌ని వైసీపీ కూడా కోరుకుంటున్నట్లే వుంది. వైసీపీ వర్సెస్ జనసేన.. అన్నట్టుగా పొలిటికల్ గేమ్ మారితే, రాష్ట్ర రాజకీయాల్లోంచి టీడీపీ తెరమరుగైపోతుంది. అదే వైసీపీకి కావాల్సింది కూడా.! అందుకే, జనసేనను మరింతగా కెలుకుతోంది వైసీపీ.

తమకు పెరిగిన పాపులారిటీ నేపథ్యంలో జనసేన పార్టీ, టీడీపీ ముందు సీట్ల పంపకాలపై గట్టి డిమాండ్లు కూడా వుంచగలుగుతోంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ ఇమేజ్ ముందు ముందు దారుణంగా పడిపోబోతోంది.! ‘చంద్రబాబు దత్త పుత్రుడు’ అనే విమర్శ జనసేనాని మీద పదే పదే వైసీపీ చేస్తున్నా, టార్గెట్ పవన్ కళ్యాణ్.. అనే ఆపరేషన్‌లో వైసీపీ కొత్త కోణం తీసుకొచ్చింది. గతంలోలా చంద్రబాబుని టచ్ చేయకుండా, కేవలం పవన్ కళ్యాణ్‌ని వైసీపీ టార్గెట్ చేస్తుండడం ఆశ్చర్యకరమే మరి.!