వైసీపీ వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయం.!

ప్రత్యేక హోదా అనవసరం.. పోలవరం ప్రాజెక్టూ అనవసరం.. రాజధాని సంగతీ అనవసరం.! ఆంధ్రప్రదేశ్ రాజకీయం వైసీపీ వాలంటీర్ల వ్యవస్థ చుట్టూ తిరుగుతోంది. ఎందుకిలా.? రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వాలంటీర్లు వున్నారని వైసీపీ చెబుతోంది. వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలేనని వైసీపీ నేతలే చెబుతున్నారు. అక్కడే వస్తోంది అసలు సమస్య.

ఒక్కో వైసీపీ వాలంటీరుకీ, వైసీపీ ప్రభుత్వం చెల్లిస్తున్న గౌరవ వేతనం 5 వేల రూపాయలు. దానికి అదనంగా, కొన్ని ఖర్చులూ సమకూరుస్తోంది. ప్రతియేడాదీ వాలంటీర్లకు పురస్కారాలు కూడా అందిస్తోంది. దాంతోపాటే, అదనంగా కొంత మొత్తం చెల్లింపులూ జరుగుతున్నాయి. ఇదంతా ప్రజాధనమే.

రాజకీయం అంటేనే సేవ.! మరి, అలా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చే రాజకీయ నాయకుులు.. ప్రజా ప్రతినిథులయ్యాక గౌరవ వేతనాలు ఎందుకు పొందుతున్నట్లు.? సలహాదారులకు ఎందుకు పెద్ద మొత్తంలో చెల్లింపులు జరుగుతున్నట్లు.? ఇవన్నీ మిలియన్ డాలర్ క్వశ్చన్స్ ఏమీ కావు.

రాజకీయ నిరుద్యోగుల కోసం నామినేటెడ్ పోస్టులు సృష్టించడం పాత విషయమే. కొత్తగా, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిందంతే. వాలంటీర్లలో మెజార్టీ వైసీపీ కార్యకర్తలే. ఇతర పార్టీల కార్యకర్తలనండీ.. మద్దతుదారులనండీ.. వాళ్ళు కూడా కొన్ని చోట్ల వాలంటీర్లుగా వున్నారు.

రెండున్నర లక్షల మంది వాలంటీర్లంటే.. అవన్నీ ఓట్లే కదా.! కేవలం ఓట్లు కాదు, ఆ వాలంటీర్లు, రాజకీయాల్ని ప్రభావితం చేయగలరన్న భావన రాజకీయ పార్టీల్లో వుంది. అధికార పార్టీకి ఈ విషయమై చాలా చాలా గట్టి నమ్మకం వుంది. అందుకే, ఇంత రచ్చ. ఆ వైసీపీ వాలంటీర్ వ్యవస్థను దెబ్బ తీస్తే.. వైసీపీ దెబ్బ తింటుందని జనసేన బావిస్తోంది. ఇది వ్యూహాత్మక రాజకీయం.!