రెడ్డిగారి రాజకీయం.. ఆ ఒక్కడూ వెళ్ళిపోతే టీడీపీ కుప్పకూలినట్టే !

YSRCP special plans in Srikalahasti
చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడానికి వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తోంది.  సొంత గడ్డ మీద దెబ్బ కొడితే చంద్రబాబు తిరిగి కోలుకోలేరనేది వైసీపీ వ్యూహం.  అయితే ఈ బాధ్యత మొత్తం వైఎస్ జగన్ కు అత్యంత ఆప్తుడు, నమ్మకస్థుడు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు.  గత ఎన్నికల్లో పక్కా ప్లాన్ ప్రకారం జిల్లాలోని 14 స్థానాల్లో 13 స్థానాలు నెగ్గించుకుంది వైసీపీ.  టీడీపీ కేవలం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మాత్రమే గెలిచింది.  అక్కడితో సీమలో టీడీపీ ప్రస్థానానికి దాదాపు బ్రేకులు పడ్డట్టే అయిపోయింది.  ఈ నేపథ్యంలో అనూహ్యంగా తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి.  ఈ ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా జిల్లా మీద పట్టు నిలుపుకోవాలని చూస్తోంది టీడీపీ. 
 
YSRCP special plans in Srikalahasti
YSRCP special plans in Srikalahasti
అయితే ఎన్నికల్లో సీట్లు గెలవలేకపోయినా కొన్ని నియోజవర్గాల్లో టీడీపీకి బలమైన కేడర్ ఉంది.  గట్టిగా కృషిచేస్తే మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.  అయితే వీటి మీద దెబ్బకొట్టాలని చూస్తోంది వైసీపీ.  అందుకు ఈ తిరుపతి ఉప ఎన్నికలనే  వేదికగా ఎంచుకుంది.  ఈ లోక్ సభ స్థానం పరిధిలో ఉన్న అసెంబ్లీల్లో తెలుగుదేశాన్ని పూర్తిగా ఖాళీ చేసే పని మొదలుపెట్టారు.  ఇందుకు పెద్దిరెడ్డిగారు పెద్ద వ్యూహాన్ని రచించి పెట్టుకున్నట్టు తెలుస్తోంది.  ముందుగా ఈ వ్యూహాన్ని  శ్రీకాళహస్తిలో ప్రయోగించాలని చూస్తున్నారు.  శ్రీకాళహస్తి టీడీపీకి ఒకప్పుడు కంచుకోట.  90 ల దశకం నుండి అక్కడ బొజ్జల కుటుంబం తెలుగుదేశం జెండాను మోస్తూ వస్తోంది.  బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వరుసగా విజయాలు సాధిస్తూ తిరుగులేని నేతగా నిలదొక్కుకున్నారు.  ఆ కుటుంబం అండ ఉన్నంతకాలం టీడీపీకి ఎలాంటి ఢోకా లేదనే స్థాయిలో పేరు ప్రఖ్యాతులను కూడగట్టుకున్నారు.  
YSRCP special plans in Srikalahasti
YSRCP special plans in Srikalahasti
 కానీ గత ఎన్నికల సమయానికి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుమారుడు సుధీర్ రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపారు.  కానీ వైసిపీ హవా ముందు సుధీర్ రెడ్డి నిలబడలేక ఓడిపోయారు.  అయితే ఈ ఓటమితోనే బొజ్జల ఫ్యామిలీ పని అయిపోయిందని అనుకోవడానికి లేదు.  గోపాలకృష్ణారెడ్డి తలచుకుంటే వచ్చే ఎన్నికల్లో కుమారుడిని గెలిపించుకోగలరు.  కానీ ఓటమి తర్వాత ఆ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు కొద్దిగా నిర్లక్ష్యం చేశారు.  ఇది సుధీర్ రెడ్డికి, గోపాలకృష్ణారెడ్డికి నచ్చలేదు.  ఇక్కడే పెద్దిరెడ్డి రాజకీయం షురూ చేశారు.  వేడి మీదున్నప్పుడే బొజ్జల కుటుంబాన్ని వైసీపీ వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నారట.  ఈమేరకు సుధీర్ రెడ్డికి వైసీపీ లీడర్ల నుండి రాయబారాలు కూడ వెళ్లాయని చెబుతున్నారు.  
 
శ్రీకాళహస్తిలో వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నప్పటికీ పార్టీలో మంచి ప్రాధాన్యం ఇస్తామని, వీలుంటే టికెట్ హామీ కూడ ఇస్తామని చెబుతున్నారట.  వీటికి కరిగి బియ్యపు ఫ్యామిలీ వైసీపీ వైపుకు తిరిగే మాత్రం శ్రీకాళహస్తిలో టీడీపీ పూర్తిగా కనుమరుగు కావడం ఖాయం.  బియ్యపు మధుసూదన్ రెడ్డి, బొజ్జల కుటుంబం గనుక ఒక్కటైతే వారిని ఢీకొట్టే ప్రత్యామ్నాయాన్ని కనుక్కోవడం చంద్రబాబుకు దాదాపు అసాధ్యం.  పైపెచ్చు ఈ మార్పు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పెను ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.  బొజ్జల  కుటుంబం సపోర్ట్ లేకపోతే టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి గెలవడం పూర్తిగా అసాధ్యం.  కాబట్టి చంద్రబాబుగారు ఈ విషయంపై గట్టిగా దృష్టిపెట్టి బొజ్జల కుటుంబం పార్టీ దాటిపోకుండా చూసుకుంటే మంచిది.