జనసేన అధినేత పవన్ కళ్యాన్ 2007లో కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం, ఆయకూ ఆయన కుమారుడు అకిరానందన్‌కీ ఎలాంటి సంబంధం లేదట. ఈ విషయాన్ని వైసీపీ నేత ఒకరు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారుతున్నాయి.
‘రేణు దేశాయ్‌తోగానీ, అకీరానందన్‌తోగానీ తనకెలాంటి సంబంధం లేదని’ పవన్ కళ్యాణ్ పేర్కొన్నట్లుగా ఏవేవో కోర్టు పత్రాల నెంబర్లు చెబుతున్నారు సదరు వైసీపీ నేత. ఆయన పేరు యనమల నాగార్జున యాదవ్ అట. ఆయన వైసీపీ అధికార ప్రతినిథి కూడానట.!
ఈ స్థాయికి దిగజారిపోయారెందుకని.? ఇదే చర్చ ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణలోనూ.. ఆ మాటకొస్తే, సర్వత్రా జరుగుతోంది. రాజకీయం కోసం మరీ ఇంతలా దిగజారిపోవాలా.? అన్న ప్రశ్న తలెత్తడంలో వింతేముంది.?
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్.. ఇద్దరూ ప్రేమించుకున్నారు, సహజీవనం చేశారు.. అది అందరికీ తెలిసిన విషయమే. ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటవడం, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం.. ఇవన్నీ తెలిసిన విషయాలే. ఇందులో దాపరికం ఏమీ లేదు.
అకిరానందన్, కొన్నాళ్ళు తన తల్లి దగ్గర వుంటాడు, కొన్నాళ్ళు తన తండ్రి దగ్గర వుంటాడు కూడా.! త్వరలో అకిరానందన్ వెండితెరకు పరిచయం కాబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల హైస్కూల్ గ్రాడ్యుయేషన్ సందర్భంగా తల్లిదండ్రుల హోదాలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.
రాజకీయంగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి ఏమీ లేక, వ్యక్తిగత విషయాల్లోకి వైసీపీ నేతలు తొంగి చూస్తున్నట్లే కనిపిస్తోంది. వైసీపీ అధినాయకత్వం, ఇలాంటి దిగజారుడు రాజకీయాల్ని ప్రోత్సహిస్తే.. అది ఆ పార్టీకే నష్టం.!