కిరాయి హంతకులు, ఐటం గాళ్ళు.. పరిటాల శ్రీరామ్‌కు పంచ్ మీద పంచ్ 

YSRCP MLA punches on Paritala Sriram
అనంతపురం జిల్లా రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది.  ప్రధాన పార్టీలు, ప్రధాన కుటుంబాలు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి.  మొన్నటికి మొన్న తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీల నడుమ చెలరేగిన చిచ్చు ఆరకముందే పరిటాల ఫ్యామిలీకి వైసీపీ నేతలను మాటల యుద్ధం మొదలైంది.  పరిటాల కుటుంబం మీద వైసీపీ ఎంపీ ఒకరు రక్తపుటేర్లు పారించారు అంటూ విపరీత వ్యాఖ్యలు చేయగా తాజాగా వైసీపీ ఎమ్మీయే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల శ్రీరామ్‌కు పంచ్ మీద పంచ్ విసిరారు.  రాప్తాడులో జరిగిన సభలో పరిటాల శ్రీరామ్ వైసీపీలో అవినీతి జరుగుతోందని విరుచుకుపడి  ఎమ్మెల్యేకు హెచ్చరికలు ఇచ్చారు.  దానికి కౌంటర్ ఇస్తూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వేరే లెవల్లో మాట్లాడారు. 
 
YSRCP MLA punches on Paritala Sriram
ప్రెస్ మీట్ ఆద్యంతం పరిటాల కుటుంబం మొత్తం అవినీతిమయమని, అక్రమాలు చేసిందని చెప్పుకొచ్చారు ప్రకాష్ రెడ్డి.  పరిటాల రవికి తండ్రి నుండి 10 ఎకరాలు వస్తే ఈరోజు ఆ కుటుంబానికి వందల వేల ఎకరాలు ఎలా వచ్చాయి.  గొర్రెల దొంగతనాలు, అక్రమాల కేసులు మీ మీద లేవా.  లా మేకర్స్ అవ్వమని ప్రజలు పదవులు ఇస్తే మీరు లా బ్రేకర్స్ అయ్యారు.  ఎవరో దాతలు ఇచ్చిన డబ్బుతో చేపట్టిన పథకాలకు మీ పేర్లు పెట్టుకుంటారు.  మీరు అభివృద్దే చేసి ఉంటే 25 వేల ఓట్ల తేడాతో ఎలా ఓడిపోతారు.  టీడీపీ ఎన్టీఆర్ ను ఎం క్యాష్ చేసుకున్నట్టు మీరు పరిటాల రవి అనే భయాన్ని ఎన్ క్యాష్ చేసుకుంటున్నారు. 
 
సూడో నక్సలైట్ల పార్టీ పెట్టి, తప్పుడు ప్రచారం చేసి కిరాయి హంతకులతో కూనీలు చేయించారు.  ప్రతిపక్షం లేకుండా రిగ్గింగులు చేసుకుని ఎన్నికలో గెలిచారు.  ఇదేనా లా అండ్ ఆర్డర్ మైంటైన్ చేసే విధానం ? మా ప్రభుత్వం వచ్చాక ఒక్క గొడవైనా జరిగిందా ? మీ పేపర్లలో తప్పుడు రాతలు రాయించారు.  నన్ను అనేందుకు యోగ్యత ఉందా నీకు.  మీరు ఐటెం గాళ్ళు.. సమాజానికి చేసిందేమీ లేదు.  రాప్తాడును కనీసం హుడా పరిధిలోకి తీసుకురాలేకపోయారు.  మేము తీసుకొచ్చి 30 వేల ఇల్లు తీసుకొచ్చి  చూపించాం.  పేరూరు ఆయకట్టుకు నీళ్లు ఇస్తున్నాం.  25 ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి కనీసం రాప్తాడు, పెనుగొండకు  మంచినీళ్లు కూడ తేలేదు.  యావన్నీ చూసే మిన్నల్ని జనం ఓడించారు’ అంటూ నిప్పులు చెరిగారు.  మరి ఎమ్మెల్యే మాటలకు పరిటాల శ్రీరామ్ లేదా పరిటాల సునీత సమాధానం చెబుతారేమో చూడాలి.