ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును వెంటాడుతున్న కేసు ఓటుకు నోటు. సీఫెన్ సన్ ను టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేలా ప్రలోభ పెట్టారని ఇందులో రేవంత్ రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరిచారని అభియగాలున్నాయి. ఈ కేసు నానాటికీ బలపడుతోంది తప్ప చంద్రబాబు అందులోంచి తప్పించుకోలేకున్నారు. అసలు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ నగరాన్ని చంద్రబాబు ఉన్నపళంగా వదిలేసి రావడానికి ఈ కేసే కారణమని చెబుతుంటారు. అందులో వాస్తవం లేకపోలేదు కూడ. ఆనాటి నుండి ఈనాటి వరకు బాబుగారి మీద ప్రత్యర్థులకు ఓటుకు నోటు ఒక పెద్ద ఆయుధంగా మారింది.
ఏ వివాదం తలెత్తినా ఈ కేసుకు లింక్ పెట్టి ఎద్దేవా చేస్తుంటారు ప్రత్యర్థి పార్టీల నాయకులు. తాజాగా రామతీర్థంలో రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వివాదంలో వైసీపీ, టీడీపీ, బీజేపీల నడుమ పెద్ద రగడ నడుస్తోంది. అధిక ప్రతిపక్షాలువిగ్రహాన్ని కూల్చింది ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నిన్న శనివారం చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి, బీజేపీ నేతలు ఒకేసారి రామతీర్థాన్ని సందర్శించడంతో వివాదం పెరిగి పెద్దదైపోయింది. దేవుడి సన్నిధిలో ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నడూ లేని విధంగా జనంలో భావిద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అందరినీ మించి చంద్రబాబు మాట్లాడిన నరరూప రాక్షసుడు అంటూ మాట్లాడిన మాటలు మరీ హైలెట్ అయ్యాయి.
హైలెట్ అవడమే కాదు అధికార పక్షాన్ని బాగానే డిస్టర్బ్ చేశాయి. దీంతో వైసీపీ నేతలు చంద్రబాబే ఈ కుట్రకు బాద్యుడని అంటూ అసలు దీని వెనుక ఓటుకు నోటు కేసు నుండి బయటపడాలనే చంద్రబాబు ప్రయత్నం ఉందని అన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసులో ఉచ్చు బిగిస్తుండేసరికి, చంద్రబాబు జై శ్రీరామ్ అంటున్నారని, బీజేపీతో ఉన్నప్పుడు జైశ్రీరామ్ అంతో బీజేపీతో లేనప్పుడు మతోన్మాద పార్టీ అంటారని, హిందూ దేవాలయల మీద దాడులు చేసిన దుర్మార్గుడు నారా చంద్రబాబు చౌదరని, నువ్వెంత నీ బతుకెంత చంద్రబాబూ.. సీఎంకు వార్నింగ్ ఇస్తావా.. ఖబడ్దార్ ఏంటీ..? నువ్వు, నీ కొడుకు, నీ సైన్యం అంతా వచ్చినా సీఎం వైయస్ జగన్ కాలి బొటనవేలు కూడా ముట్టుకోలేరు అన్నారు.
అంతేకాదు రామతీర్థం ఘటనలో ప్రేమేయం ఉన్నట్టు తేలితే శిక్ష తప్పదని అన్నారు. ఆయన మాటల్ని చూస్తే రామతీర్థం ఘటనకు చంద్రబాబునే పూర్తి బాద్యుడిగా చేసేలా ఉన్నారు. ఒకవేళ బాబుగారిని బుక్ చేయగల సాక్ష్యాలు దొరికితే అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇంకోవైపు ఓటు నోటు కేసు. ఇలా రెండు వైపుల నుండి చంద్రబాబుకు అరెస్ట్ గండం ముంచుకొస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు.