రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎవరికి శత్రువులుగా మారుతారో చెప్పడం చాలా కష్టం. సహజంగా ఒక పార్టీ నేత మరో పార్టీ నేతలపై ఆరోపణలు, విమర్శలు, కేసులు వేయడం చూస్తూ ఉంటాము. అయితే ఇప్ప్పుడు వైసీపీ లో మాత్రం వింత సంస్కృతి నెలకొంది. ఇప్పటికే వైసీపీలోకి ఇతర పార్టీ నేతలు రావడంతో, వస్తుండటంతో ఆధిపత్యపోరు మొదలయింది. అలాగే ఇప్పుడు సొంత పార్టీ నేతలే తమపై తాము కేసులు పెట్టుకుంటున్నారు. వైసీపీలో అంబటి రాంబాబు ఉన్న ప్రాముఖ్యత గురించి అందరికి తెల్సు. ఆయన తన వాగ్దాటితో ప్రతిపక్షాల నేతలకు చుక్కలు చూపిస్తారు.
అలాగే ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర కూడా ఆయనకు చాలా చనువు ఉంది. అయితే ఇప్పుడు అంబటి రాంబాబు కు సొంత పార్టీ నేతలే శత్రువులుగా మారారు. వైసీపీ నేతలే ఆయనపై కేసులు పెడుతున్నారు.
అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారు అని వైసీపీ కార్యకర్తలు కేసు నమోదు చేయడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే అంబటి రాంబాబు ను ఎవరు టార్గెట్ చేశారు అనేది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. రాంబాబు దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే అంబటి రాంబాబుని టార్గెట్ చేసింది మాత్రం ఆయన అంటే గిట్టని సరిహద్దు ఎమ్మెల్యే ఒకరు ఉన్నారని, ఆయన ఇప్పుడు అంబటి రాంబాబు ని టార్గెట్ చేసే విధంగా కేసు నమోదు చేయించారని అంటున్నారు. అంతే కాకుండా ఒక ఎంపి గారు కూడా అంబటి రాంబాబు విషయంలో తనకి వ్యతిరేకంగా వ్యవహరించారని, అయితే ఇది ముందే సీఎం జగన్ కు తెలుసు అని, అంబటి రాంబాబు దూకుడుకు కళ్లెం వేయడానికి ఈ విధంగా వారు తెలియనట్లు వ్యవహరించారని వైసీపీ నేతలే అంటున్నారు. అసలే దూకుడు కలిగిన అంబటి రాంబాబు ఈ కేసుల విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అలాగే పార్టీ నెలకొంటున్న అసమ్మతిని పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎలా ఎదురుకొంటారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.