AP: అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన జగన్… ఐదు నిమిషాలు కూడా లేరా?

AP: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 8 నెలల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈయన 11 సీట్లు మాత్రమే గెలవడంతో చివరికి ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి వస్తానని జగన్ భీష్ముంచుకొని కూర్చున్నారు.

ఇక నేడు గవర్నర్ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే తన 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అయితే ఈయన అసెంబ్లీలోకి వచ్చిన కొద్దిసేపటికే తిరిగి వాక్ అవుట్ చేసి బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.

గవర్నర్అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని మొదలు పెట్టగానే వైసీపీ సభ్యులు సేవ్ డేమోక్రసీ అంటూ నినాదాలు మొదలు పెట్టారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. పోడియం వద్దకు వచ్చి నిలుచున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా కల్పించాలి అంటూ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ విషయంపై స్పీకర్ కి కూడా లేఖ రాశారు కానీ స్పీకర్స్ అందించకపోవడంతో ఈయన కోర్టుకి కూడా వెళ్లారు.

ఆ పిటిషన్ పెండింగ్ లో ఉంది. దీంతో గత సమావేశాలకు జగన్ హాజరు కాలేదు. ఆయనతో పాటు మిగిలిన సభ్యులు కూడా హాజరు కాలేదు. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నించే అవకాశం ఉంటుందని వైసీపీ అంటోంది. నిబంధనల ప్రకారం అలా ఇవ్వటం కుదరదని ప్రతిపక్ష నేత హోదా అనేది అధికార ప్రభుత్వ చేతులలో ఉండదని ప్రజల చేతులలో ఉంటుందని ప్రజలే ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాల్సి ఉంటుంది అంటూ అధికార నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా జగన్ అసెంబ్లీ లోకి వచ్చి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈయన మాత్రం అసెంబ్లీ లోకి అడుగుపెట్టిన ఐదు నిమిషాలకే బయటకు వెళ్ళిపోయారు.