వైఎస్సార్ రైతు భరోసా స్కీమ్ తో రూ.13,500.. ఈ స్కీమ్ లో ఎలా చేరాలంటే?

ఏపీలోని రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో జగన్ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో వైఎస్సార్ రైతు భరోసా స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి 13,500 రూపాయలు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. అర్హత ఉండి ఈ నగదు జమ కాని వాళ్లు ఈ పథకంలో చేరడం ద్వారా ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందవచ్చు. కొన్ని నియమనిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.

పీఎం కిసాన్ స్కీమ్ తో కలిపి రైతులకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతోంది. అన్నదాతలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా జగన్ సర్కార్ ప్రజలకు మరింత దగ్గరవుతోంది. https://ysrrythubharosa.ap.gov.in/rbapp/index.html వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకోవచ్చు. రైతులకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం.

అర్హత ఉన్నా ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందని వాళ్లు రైతు భరోసా కేంద్రాలకు వెళ్లడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకునే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పొలం పట్టా, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ కలిగి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7,500 రూపాయలు ఈ స్కీమ్ ద్వారా అందే అవకాశం అయితే ఉంది.

మూడు వాయిదాల రూపంలో జగన్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్లు వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. రైతులకు ఈ స్కీమ్ ద్వారా ఆర్థికంగా ఎంతో బెనిఫిట్ కలగనుంది. సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.