వైఎస్సార్ కళ్యాణమస్తు స్కీమ్ తో ఇన్ని లాభాలా.. వాళ్లకు లక్ష రూపాయలా?

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్ లో వైఎస్సార్ కళ్యాణమస్తు స్కీమ్ కూడా ఒకటి. ముస్లింలకు ఈ స్కీమ్ షాదీ తోఫా పేరుతో అమలవుతోంది. ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందాలని అనుకున్న జంటలు పెళ్లైన 60 రోజుల్లోగా గ్రామ, వార్డ్ సచివాలయాలలో దరఖాస్తు చేసుకుని ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం 1,20,000 రూపాయలు ఇవ్వనుంది.

ఈ స్కీమ్ కింద బీసీలకు 50,000 రూపాయల చొప్పున అకౌంట్ లో జమ కానుంది. కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు మాత్రం ఏకంగా 75,000 రూపాయల స్థాయిలో బెనిఫిట్ కలగనుంది. అయితే అర్హతలు ఉన్నవాళ్లు మాత్రమే ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందడానికి అర్హత కలిగి ఉంటారు. నిరుపేద ఆడపిల్లలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.

దివ్యాంగులకు ఈ పథకం కింద లక్షన్నర రూపాయలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. http://gsws-nbm.ap.gov.in వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. వైఎస్సార్ కళ్యాణమస్తు స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పూర్తిస్తాయిలో పొందే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది.

పది ఎకరాల కంటే తక్కువ పొలం ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు. మున్సిపల్ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలంలో నివాసం ఉన్నవాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్ పొందడానికి అర్హత కలిగి ఉంటారు. కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయిలు మాత్రమే ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.