డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఆ స్కీమ్ తో భారీగా ప్రయోజనాలు?

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ వైఎస్సార్ ఆసరా పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా డ్వాక్రా మహిళలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది. వైఎస్సార్ ఆసరా స్కీమ్ ద్వారా సీఎం జగన్ 78 లక్షల కంటే ఎక్కువమంది మహిళలకు ప్రయోజనం చేకూర్చుతుండటం గమనార్హం. ప్రభుత్వం 7.97 స్వయం సహాయక సంఘాలకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ కలిగిస్తోంది.

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా జగన్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధారంగా ఈ స్కీమ్స్ అమలవుతున్నాయని తెలుస్తోంది. 2019 సంవత్సరం నుంచి జగన్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. డ్వాక్రాలో ఉన్న ప్రతి మహిళకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ కలుగుతుండటం గమనార్హం.

వైఎస్సార్ ఆసరా స్కీమ్ ద్వారా డ్రాక్రా మహిళలకు పెద్దగా నిబంధనలు లేకుండానే నగదు జమవుతోంది. డ్రాక్రా మహిళలు ఈ నగదును తమ సొంత అవసరాల కోసం కూడా వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. జగన్ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ పై పేద ప్రజల నుంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి. ప్రతి కుటుంబానికి లబ్ధి కలిగేలా ఏపీ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుండటం గమనార్హం.

జగన్ సర్కార్ పథకాలపై ఇతర రాష్ట్రాల ప్రజల్లో కూడా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తమ రాష్ట్రాలలో కూడా ఈ పథకాలను అమలు చేస్తే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. జగన్ సర్కార్ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త పథకాలను అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.