జగన్ సర్కార్ పేదలందరికీ ఇళ్లు పేరుతో అమలు చేస్తున్న స్కీమ్ పేద ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఈ స్కీమ్ ద్వారా జగన్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు పక్కా నివాసాలను కల్పిస్తోంది. ఇప్పటికే 3 లక్షలకు పైగా గృహ నిర్మాణాలు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ ఇళ్లకు వేగంగా నీరు, కరెంట్ అందే విధంగా జగన్ సర్కార్ అడుగులు వేస్తుండటం గమనార్హం.
ఇళ్లలో టిడ్కో ఇళ్లతో పాటు సాధారణ గృహాలు సైతం ఉన్నాయి. జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల విషయంలో జగన్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. డ్రెయిన్ల నిర్మాణానికి సైతం జగన్ సర్కార్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. జగన్ సర్కార్ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందడుగులు వేస్తోంది. అయితే అర్హత ఉన్నా స్థలం పొందని వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
అర్హత ఉన్నా స్థలం రాకపోతే గ్రామ వాలంటీర్ ను సంప్రదించాలి. ఇప్పటికే దరఖాస్తు చేసి దరఖాస్తు రిజెక్ట్ అయ్యి ఉంటే దరఖాస్తు ఎందుకు రిజెక్ట్ అయిందనే విషయాన్ని తెలుసుకోవాలి. దరఖాస్తుకు సంబంధించి జరిగిన తప్పొప్పులను సరి చేసి మళ్లీ దరఖాస్తు చేయడం ద్వారా బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఇల్లు లేనివారు ఈ స్కీమ్ ద్వారా సెంటు లేదా సెంటున్నర స్థలాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
జగన్ సర్కార్ ఈ పథకాన్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది. అర్హత ఉన్నవాళ్లకు మేలు జరిగే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తుండటం గమనార్హం. జగన్ సర్కార్ నవరత్నాలలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చెస్తూ ఉండటం గమనార్హం,