వైస్ షర్మిలని లైట్ తీసుకోవడమే వైసీపీకి ఉత్తమం.!

వైఎస్ షర్మిల రెడ్డి కాస్తా మొరుసుపల్లి షర్మిల శాస్త్రిగా ఎందుకు మారింది.? ఈ ప్రశ్న ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ చర్చనీయాంశమవుతోంది. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డికి ఏకంగా మతమే మార్చేశారు. ఇప్పుడేమో షర్మిల మీద కూడా నిస్సిగ్గు రాజకీయం ప్రదర్శిస్తున్నారు.. ఇదీ వైసీపీ గురించి జనాల్లో జరుగుతున్న చర్చ.

2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసిన వైఎస్ షర్మిల, ఇప్పుడెందుకు ప్లేటు ఫిరాయించారు.? అంటే, ఇది రాజకీయం.! ఆమె ఏదో రాజకీయ లబ్దిని అన్న వైఎస్ జగన్ నుంచి ఆశించారు, అది కుదరలేదు.! పార్టీలో ఎందరికో పదవులు ఇచ్చుకున్న జగన్, తన తల్లిని ఎందుకు పార్టీ నుంచి బయటకు పంపేశారు.? చెల్లికి ఎందుకు పదవులు ఇచ్చుకోలేకపోయారు.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది.

రాజకీయాల్లో ఇవన్నీ మామూలే.! స్వర్గీయ ఎన్టీయార్‌ని చంద్రబాబు రాజకీయంగా వెన్నుపోటు పొడిచారు. తండ్రికి వ్యతిరేకంగా రాజకీయం నడిపారు దగ్గుబాటి పురంధరీశ్వరి.. ఇదంతా చరిత్ర.. చెరిగిపోయేది కాదు.!

వైఎస్ షర్మిల కూడా రాజకీయమే చేస్తున్నారు.! అయితే, ఇప్పుడు సోషల్ మీడియా అత్యంత జుగుప్సాకరంగా తయారైంది కదా.. అదే అసలు సమస్య. షర్మిల మీద ఇంత దారుణమైన పదజాలాన్ని వైసీపీ ఎందుకు ఉపయోగిస్తోందన్నదేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్ కాదు.!

వైసీపీ సోషల్ మీడియా విభాగం అతి చేస్తోంది. ఇందులో డౌటానుమానాలు ఏమీ లేవ్. రాత్రికి రాత్రి రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా ఈక్వేషన్ మారిపోయిందనడం అతిశయోక్తి కూడా కాకపోవచ్చు. సొంత చెల్లెలి విషయంలో జగన్ ఇంతలా ఎలా వ్యవహరిస్తున్నారు.? అన్న ప్రశ్న జనం మెదళ్ళను తొలిచేస్తోంది.

అత్యుత్సాహంతో వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన అతి, జగన్ కొంప ముంచేలా వుంది.