ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి శాసించారు. అప్పట్లో ఆయనకు ఉన్న ప్రజాధారణను చూసి పెద్ద పెద్ద నాయకులు కూడా భయపడేవారు. ఒకానొక టైం రాజశేఖర్ రెడ్డి ప్రధాని కూడా అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ లాంటి ప్రజాకర్షక పథకాలను తీసుకొచ్చిన వైఎస్ఆర్ పలువురికి ఆరాధ్య సీఎం అయ్యారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోడానికి పాదయాత్ర చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,467 కిలోమీటర్లు నడిచారు. ఆ సమయంలో రైతులు, చదువుకోడానికి పేద విద్యార్థులు పడుతోన్న కష్టాలను చూసి చలించిపోయారు. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు.
పథకాలను తీసుకొచ్చారు. 108, 104 సేవలతో ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న వైఎస్.. మెడిసిన్ పూర్తిచేసి వైద్యవృత్తిని స్వీకరించారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. తొలిసారిగా 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా, కడప లోక్‌సభ నుంచి నాలుగుసార్లు గెలుపొందారు. పోటీచేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి పదవి దక్కించుకున్నారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా సీఎం పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు.
ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత తాను చేయాలనుకున్న వాటిని చేస్తూ ఆయన రాజకీయల్లో నూతన ట్రెండ్ ను సెట్ చేశారు. ప్రజలను డబ్బుతో కొనవచ్చు అనుకునేవారికి ప్రజలను అభివృద్ధితో మాత్రమే కొనగలమని, వారి కష్టాలను తీర్చే వారికే ప్రజలు అధికారం ఇస్తారని నిరూపించి రాజకీయాల్లో నూతన ట్రెండ్ ను సృష్టించారు.