ముందస్తుపై ‘సర్వే’ చేయిస్తున్న వైఎస్ జగన్.?

షెడ్యూల్ ప్రకారం అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఏప్రిల్ – మే నెలల్లో ఎన్నికలు జరగాలి. సార్వత్రిక ఎన్నికలే ఇవి. కానీ, అంతకన్నా ముందే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయా.? అది కూడా కేవలం అసెంబ్లీకే ఎన్నికలు జరిగితే లాభమేంటి.?

రాజకీయాల్లో ఏ పార్టీకి అయినా ఖచ్చితమైన వ్యూహాలుంటాయ్.. వుండాలి కూడా. ఒక్కోసారి ఆ వ్యూహాలు బెడిసి కొట్టొచ్చనుకోండి.. అది వేరే సంగతి. 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ, తెలంగాణలో ఆ తర్వాత 2018లోనే ముందస్తు ఎన్నికలు జరిగాయి.

ఇప్పుడు అదే ఫాలో అయ్యేలా వుంది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ. ‘మాకు ముందస్తు అవసరమేంటి.?’ అని వైసీపీలో కొందరు నేతలు చెబుతున్నా, ముందస్తు దిశగానే వైఎస్ జగన్ ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలోనే, పార్టీలో కొందరు నేతల అసలు రంగు బయటపడుతోంది.

ఈ నేపథ్యంలో.. ఇదే వేడిలో ముందస్తుకి వెళితే ఎలా వుంటుంది.? అన్న దిశగా అధినేత వైఎస్ జగన్ సమాలోచనలు చేస్తున్నారట. ఒకవేళ ముందస్తుకు వెళితే ఎప్పుడు.? అన్నదానిపైనే కొంత సందిగ్ధం వున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలాఖరులో ముందస్తుపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం.

మూడు రాజధానుల అంశాన్ని బేస్ చేసుకుని, వైఎస్ జగన్ ముందస్తు ఆలోచన చేస్తున్నారట. విపక్సాలు ఇంకా ఎన్నికలకు సన్నద్ధం కాలేదు గనుక.. ఇప్పుడైతేనే, బంపర్ విక్టరీ సాధ్యమవుతుందన్నది జగన్ ఆలోచన అని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.