బ్రహ్మాస్త్రాన్ని రెడీ చేసిన జగన్.. ఎన్నికల్లో గెలుపు లాంఛనమే ! 

రాజకీయ వ్యూహాలను పన్నడంలో, ప్రజలను ఆకట్టుకోవడంలో వైఎస్ జగన్ ప్రత్యర్థులకంటే ఒకడుగు ముందే ఉంటారు.  మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో  ఆయన స్ట్రాటజీలు చాలా బలంగా ఉంటాయి.   గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో  భారీ సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో పెట్టి ఓటర్లను తనవైపుకు తిప్పుకున్నారు.  జగన్ అంతటి భారీ మెజారిటీతో గెలవడానికి మెయిన్ రీజన్ అదే కావడం విశేషం.  అందుకే ఈ ఫార్ములాను రాబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో ప్లే చేయాలని  చూస్తున్నారు.  ఇప్పటికే నవరత్నాల్లో పథకాలను అమలుచేస్తున్న జగన్ ఇప్పుడు ఉచిత ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు.  నవరత్నాల్లో ఎన్ని పథకాలున్నా ఈ ఉచిత పట్టాల మీద పేదలు చాలా ఆశలు పెట్టుకున్నారు.  జగన్ గత ప్రభుత్వాలకు భిన్నంగా అనుభవించే హక్కు మాత్రమే కాదు ఆస్తి హక్కు కూడ కల్పిస్తానని, ఉచిత ఇల్లు కట్టిస్తామని అనడంతో ప్రజల్లో ఆశలు పెరిగాయి.

బ్రహ్మాస్త్రాన్ని రెడీ చేసిన జగన్.. ఎన్నికల్లో గెలుపు లాంఛనమే ! 
YS Jagan master plan for Tirupathi by polls

కానీ రాజ్యాంగం రీత్యా ఉచిత పట్టాలకు అమ్ముకునే హక్కు కుదరని పని.  ఈ విషయమై హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి.  విచారణ నడుస్తోంది.  దీని మూలంగా ఇప్పటికే ఆరేడు నెలలు ఆలస్యమైంది.  ఇదిగో అదిగో అని ఎదురుచూసిన లబ్ధిదారులు ఉసూరుమంటున్నారు.  ఈ సమయంలో గనుక వారికి పట్టాలిస్తే  ప్రభుత్వం మీద ప్రశంసలు కురవడం ఖాయం.  అందుకే జగన్ ఆస్తి హక్కు సంగతి పక్కన పెట్టి డీ-పట్టాలు ఇవ్వడానికి రెడీ అయ్యారు.  డిసెంబర్ 25న ఈ పంపిణీ కార్యక్రమం జరగనుంది.  ఈ ప్రతిష్టాత్మకమైన పథకంతో ప్రజల్లో నిలిచిపోవాలనేది జగన్ ఆలోచన.  ముందుగా ఈ పథకాన్ని ఉపఎన్నికల్లో వాడుకోవాలని రెడీ అయ్యారు.  అందుకే ఇళ్ల పట్టాల పంపిణీని తిరుపతి లేదా శ్రీకాళహస్తి నుండి మొదలుపెడతారట.  ఈ రెండు నియోజకవర్గాలు కూడ తిరుపతి లోక్ సభ పరిధిలోకే వస్తాయి.  

వాటిలో గనుక ముందుగా పట్టాలు పంపిణీ జరిగితే ప్రభుత్వానికి చాలా మేలు జరుగుతుంది.  ప్రజల్లో ఆదరణ మరింత పెరుగుతుంది.  ఉప ఎన్నికల వరకు ఈ పట్టాల పంపిణీ, ఇళ్ల శంఖుస్థాపన హడావుడి ఎలాగూ ఉంటుంది కాబట్టి ఉప ఎన్నికల ప్రచారంలో దాన్నే ప్రధాన ఆయుధంగా మలుచుకుని ప్రజల మన్ననలు పొందాలని చూస్తున్నారు.  జగన్ వేసుకున్న ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కవుట్ అయ్యే అవకాశం ఉంది.  ఆ లోక్ సభ స్థానం ఎలాగూ వైసీపీ గెలిచిన స్థానమే.  పైగా ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు.  ముఖ్యమంత్రి తిరుపతి నుండే పట్టాల పంపిణీ ప్రారంభించడం ఇవన్నీ కలిసి ప్రత్యర్థుల మీద బ్రహ్మాస్త్రంగా పనిచేస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.  ఇక్కడ చేయవలసిందల్లా పంపిణీ కార్యక్రమం ఇదివరకటిలా మళ్ళీ వాయిదా పడకుండా పక్కాగా 25నాడు మొదలయ్యేలా చూడటమే.