రొటీన్ కి భిన్నంగా… వైసీపీ మద్దతిచ్చే ప్రభుత్వంలో టీడీపీ మంత్రులు?

దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో ఎలగైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఎన్డీయే కూటమి భావిస్తుండగా.. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశం ఛిన్నాభిన్నం అయిపోద్దంతూ ఇండియా కూటమి ఆందోళన వ్యక్తం చేస్తూ ఓట్లు అడుగుతుంది! ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.

అవును… దేశవ్యాప్తంగా 7దశల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటికే అయిదు విడతల పోలింగ్ ముగిసింది. ఈ సమయంలో ఓటింగ్ సరళి చూసిన ఇండియా కూటమి నేతలు ఈసారి కచ్చితంగా తమకు అనుకూల ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. మరోపక్క పైకి 400 కన్ ఫాం అని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నా.. వాస్తవాలు మాత్రం అందుకు అనుకూలంగా లేవని అంటున్నారు.

బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా 200, ఎన్డీయే మిత్రులతో కలిపిస్తే మరో 50 దాకా వచ్చి ఆగిపోతుందనే విశ్లేషణ ఒకటి తెరపైకి వచ్చింది. అంటే… 272 మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేయాలంటే బయట నుంచి కచ్చితంగా 20 నుంచి పాతిక మంది ఎంపీల మద్దతు తీసుకోవాల్సిందే అని చెబుతున్నారు. ఈ సమయంలోనే ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా మూడు పార్టీల పేర్లు తెరపైకి వస్తున్నాయి.

వాస్తవానికి దేశంలో సుమారు అన్ని పార్టీలూ అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమివైపు చేరుకున్నాయి! ఒడిషాలోనీ బీజేడీ, తెలంగాణలోని బీఆరెస్స్, ఏపీలోని వైసీపీలు మాత్రం ఏ కూటమికీ చెందకుండా ఇండివిడ్యువల్ గా బరిలోకి దిగాయి. ఈ సమయలో బీజేడీకి కచ్చితంగా పది సీట్లు వస్తాయని చెబుతున్నారు. వీరు బీజేపీకి సపోర్ట్ చేస్తే 50శాతం సేఫ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇక తెలంగాణ బీఆరెస్స్ విషయానికొస్తే.. ఈ లోక్ సభ ఎన్నికల్లో వారికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపై బలమైన మాటలు తెరపైకి రావడం లేదని చెబుతున్నారు. మరోపక్క ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం.. వస్తే, వారికి కనీసం 15 తక్కువ కాకుండా ఎంపీ సీట్లు వస్తాయని అంటున్నారు. ఈ సమయంలో కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావాలంటే కచ్చితంగా వైసీపీ సపోర్ట్ అవసరం పడే అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నారు.

అంటే… రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినా రాకపోయినా.. కేంద్రంలో మాత్రం వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్న నేపథ్యంలో… ఒకవేళ కేంద్రంలో బీజేపీకి కచ్చితంగా వైసీపీ సహాయ సహకారాలు అవసరమైన పరిస్థితుల్లో… ఏపీకి అవసరమైన కొన్ని కండిషన్స్ ని తెరపైకి తెచ్చి, ఆ మేరకు జగన్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అయితే… అప్పుడు కేంద్రంలోని ప్రభుత్వంలో టీడీపీ ఎంపీలు మంత్రులుగా ఉంటారా?

వైసీపీ మద్దతు ఇచ్చిన పార్టీలో టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రులుగా కొనసాగితే అందుకు జగన్ అంగీకరిస్తారా.. అది ప్రాక్టికల్ గా జరిగేపనేనా.. అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే… జగన్ మాత్రం బయట నుంచి మద్దతు ఇచ్చినా కూడా… జగన్ మద్దతు ఇచ్చిన ప్రభుత్వంలో టీడీపీ ఎంపీలు మంత్రులుగా కొనసాగడం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.